notification issued for andhrapradesh mlc elections

12 local bodies mlc elections schdule released in ap today

notification issued for andhrapradesh mlc elections, local bodies quota poll, MLC elections, MLC elections schedule, elections notification, andhrapradesh local bodies mlc quota

notification issued for 12 andhrapradesh mlc elections under local bodies quota

ఏపీలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటఫికేషన్ జారీ..

Posted: 06/02/2015 09:58 PM IST
12 local bodies mlc elections schdule released in ap today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మంగళవారం ఎన్నికల షెడ్యూల్ జారీ అయింది. ఈ నెల 9న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జూన్ 9 నుంచి 16 వరకు నామినేషన్లు స్వీకరణ జరగనుంది. అలాగే జూన్ 17న నామినేషన్లను పరిశీలన.. 19 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు విధించారు. అనంతరం జూలై 3న పోలింగ్ జరిపి, జూలై 7న ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

ఈ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది. ఏపీలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు ఇలా ఉన్నాయి.. అనంతపురం -1, కృష్ణా -2, తూర్పుగోదావరి జిల్లా-1, గుంటూరు -2, విశాఖపట్నం -2, విజయనగరం -1, చిత్తూరు-1, ప్రకాశం -1, కర్నూలు-1 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదిలా ఉండగా, తెలంగాణలో స్థానిక ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజన షెడ్యూల్ మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తుంది.
.
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : local bodies quota poll  MLC elections schedule  elections notification  

Other Articles