Sensex falls 661 pts post RBI policy, monsoon forecast cut

Sensex rupee slump as monsoon forecast clouds rate cut hopes

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp

Equity benchmarks shed more than 2 percent after teh Reserve Bank of India raised inflation forecast for January 2016 and Met Department cut monsoon forecast. The Sensex was down 660.61 points or 2.37 percent at 27188.38, and the Nifty fell 196.95 points or 2.34 percent to 8236.45.

నష్టాల సునామీతో స్టాక్ మార్కెట్లు కుదేలు..

Posted: 06/02/2015 09:09 PM IST
Sensex rupee slump as monsoon forecast clouds rate cut hopes

స్టాక్‌ మార్కెట్ల ఇవాళ నష్టాల సునామీని ఎదుర్కోన్నాయి. నష్టాల సునామీ ధాటికి విలవిలలాడిన దేశీయ సూచీలు తీవ్రంగా కుదేలయ్యాయి. అసలే నూతన ఆర్థిక సంవత్సరం నుంచి ఒడిదోడుకుల మధ్య కోట్టమిట్టాడుతున్న మార్కెట్లను ఇవాళ రెండు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షతో భారీ నష్టాల బాట పట్టిన స్టాక్‌మార్కెట్లు.. వానకు గాలి తోడవితే.. పెను బీభత్సంగా మారుతుందన్న చందగా, అర్బీఐ దెబ్బతో అతలాకుతమైన స్టాక్ మార్కెట్లపై.. భారత వాతావరణశాఖ ఐఎండీ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులపై జారీ చేసిన అంచనాలతో మరింత కిందకు దిగజారాయి.

భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరిమితి విధానంపై సమీక్షించనుందన్న సమాచారంతో.. ఉదయం ప్రారంభం కాగానే మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టంతో. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో కోనసాగాయి. ఆర్బీఐ ద్రవ్య పరిమితి విధాన సమీక్షలో రెపో రేటు, రివర్స్ రెపో రేటును తగ్గించి, గృహ, వాహన రుణదాతలకు శుభవార్తనందించిన నేపథ్యంలో.. పారిశ్రామిక రంగానికి మేలు చేసేలా నిర్ణయాలు లేకపోవడంతో.. బ్యాంకింగ్ రంగ సూచీలు కుదేలయ్యాయి. మదుపరుల అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు పతనం దిశగానే పయనించాయి.

అతే సమయంలో భారత వాతవావరణ శాఖ ఐఎండీ కూడా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు అంత మెరుగ్గా వుండబోమని అంచనా వేసిన వివరాలను వెలువరించింది. రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ, కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందంది. ఈ సారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షపాతం 93 నుంచి 88శాతానికి తగ్గుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఐఎండీ అంచనాల ప్రభావం కూడా స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది

దీంతో మధ్యహ్నం వరకు 400 పాయింట్ల నష్టంతో కొనసాగిన మార్కెట్లు.. సాయంత్రం ముగిసే సమయానికి భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 661 పాయింట్ల నష్టంతో 27 వేల 188 పాయింట్ల వద్ద ముగియగా, అటు నిఫ్టీ కూడా 197  పాయింట్ల నష్టంతో 8236 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో జీ ఎంటర్ టైన్ మెంట్, లుపిన్, భారతీ ఎయిర్ లెట్ సంస్థల షేర్లు మినహా ఇతర సంస్థల షేర్లేవీ కూడా లాభాల భాటలో పయనించలేదు. కాగా, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, హిండాల్కో, ఏషియన్ పెయింట్స్, యస్ బ్యాంక్, తదితర సంస్థల షేర్లు నస్టాలను చవిచూశాయి. మరోవైపు ఫోరెక్స్ మార్కెట్ లో రూపాయి కూడా పతనం చెందింది. డాలర్ తో రూపాయి మారకం విలువ దిగజారింది. సోమవారం 63.73 వద్ద ముగిసిన రూపాయి.. ఇవాళ 18 నుంచి 19 పైసల మేర నష్టపోయింది. ఇవాళ 63.90 పైసల వద్ద ముగిసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles