BiG B expresses grief over farmers sucide in India

Amitabh bachchan expresses grief over farmers suicides

amitabh bachchan expresses grief over farmers suicides, BiG B expresses grief over farmers sucide, farmer suicides, amitabh bachchan, amitabh grief, farmers suicides in India, lack of 20, 30 thousand rupees

bollywood superstar big B amitabh bachchan expresses grief over farmers suicides in India, says peasants are ending thier lives because of not having 20, 30 thousand rupees

రూ. 20, 30 వేల కోసం ప్రాణాలు పోతున్నాయ్: అమితాబ్

Posted: 05/30/2015 04:25 PM IST
Amitabh bachchan expresses grief over farmers suicides

బాలీవుడ్ బిగ్ బి, సూపర్ స్టార్ ప్రపంచ వ్యాప్తంగా అశేష జనాధరణ కలిగిన ప్రముఖ సినీనటుడు అయనే అమితాబ్ బచ్చన్. ఆయన నిత్యం తన సినిమా లోకంలోనే విహరిస్తుంటారు. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అవుతూ అభిమానులతో సోషల్ మీడియా అనుసంధానంగా కలుస్తుంటారు. తనకు సంభించిందిన తాజావార్తలు, విశేషాలను వారితో పంచుకుని సంబరపడిపోతుంటారు. ఏడు పదుల వయస్సు దాటిని ఇంకా నిత్యనూతన విద్యార్థి మాదరిగానే ఆయన వ్యవహరిస్తుంటారు. అదే ఆయన గోప్పదనం. అమితాబచ్చన్ కోసం ఇంతగా ఉపోద్ఘాతం అవసరం లేదు. ఎందుకంటే అయన దేశప్రజలందరికీ సుపరిచితులే కాబట్టి.

అయితే.. ఎందుకో గత కోంత కాలంగా ఆయన దేశంలోని పరిస్థులను గమనిస్తున్నట్లు వున్నారు. పలువురి ద్వారా విషయాలను కూడా తెలుసుకుంటున్నట్లు వున్నారు. ఆయన సతీమణి జయాబచ్చన్ రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న కారణం చేతనో.. లేక మరే కారణం చేతనో.. దేశంలో అన్నదాతల పరిస్థితులపై ఆయన స్పందించారు. దేశంలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని అమితాబ్ బచ్చన్ అన్నారు. కాగా, అంతకన్నా దారుణం విషయమేమిటంటే.. చేతిలో రూ. 20  వేలు, రూ. 30 వేలు లేకపోవడంతో.. రైతులు బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

యావత్ దేశానికి అన్నం పెడుతున్న రైతన్న మరీ దర్భర జీవితాలను గడపలేక, తన కుటుంభ సభ్యులకు అన్నం పెట్టలేక.. తనకు తానే విషం తీసుకుని అమరుడవుతన్నాడని.. ఇదే పరిస్థితి మరికోన్నాళ్ల పాటు కోనసాగితే.. రైతు అనేవాడే దేశంలో కనబడరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల గురించి పట్టించుకోకపోతే మొత్తం సమాజమే ముప్పులో పడిపోతుందని హచ్చరించారు. రైతన్నలను కాపాడాల్సిన బాధ్యత యావత్ దేశ ప్రజలందరిపైనా ఉందన్నారు. ముఖ్యంగా రాజకీయ నేతలు రైతుల సమస్యలను తెలుసుకుని, వారికి సహకరించేందుకు ప్రయత్నించాలన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సైతం రైతులకు తొలి ప్రాధాన్యతను ఇవ్వాలని అమితాబ్ కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : farmer suicides  amitabh bachchan  amitabh grief  

Other Articles