jaipal reddy takes on pm modi and cm kcr

Jaipal reddy slams modi government

jaipal reddy takes on pm modi and cm kcr, jaipal reddy slams modi government, modi government, pm modi, l k advani, sushma swarai, pakistan, terrorists, Jammu and kashmir, telangana government, KCR, PDP, Jaipal reddy

former union minister s.jaipal reddy takes on central government says modi made advani mummu and sushma dummy

టెరరిస్టుల సాయంతో కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం.. మోడీ దేశభక్తిని తెలియజేస్తుంది

Posted: 05/27/2015 01:28 PM IST
Jaipal reddy slams modi government

విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు దూరంగా వుంటే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్రమాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  మోదీకి జ్ఞానం తక్కువ....అహంకారం ఎక్కువ అని ఆయన దుయ్యబట్టారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ బీహార్‌లో తక్షశిల, నలంద ఉందన్న మోదీకి చరిత్రే కాదు జాగ్రఫీ కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఐఐటీ గురించి పరిజ్ఞానం లేని మోదీకి ప్రవాసభారతీయులు స్వాగతం చెబుతున్నారన్నారు. బీజేపీలో సీనియర్ నాయకులను పక్కన బెట్టిన మోడీ.. అసలు బీజేపి అంటే తానేనన్నట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాశ్మీర్ టెర్రరిస్టుల సాయంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి దేశ భక్తి ఎంత ఉందో దీని ద్వారా అర్థమవుతుందన్నారు. పాకిస్థాన్ విషయంలో మోదీ ఎన్నికల ముందు ప్రదర్శించిన దేశభక్తి ఇప్పుడు చూపడంలేదని జైపాల్రెడ్డి విమర్శించారు.  

ప్రధానమంత్రి రేసులో వున్న బీజేపి అగ్రజుడు ఆద్వానీని మమ్మీగా, సుష్మాను డమ్మీగా మార్చారని విమర్శించారు. సుష్మాస్వరాజ్‌ను మోదీ రాజకీయంగా దేశబహిష్కరణ చేశారని జైపాల్‌ వ్యాఖ్యానించారు. అసాధ్యమైన హామీలు ఇవ్వడంలో మోదీ, కేసీఆర్‌ ఒక్కటే అని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మోదీ అసాధ్యమైన వాగ్దానాలు చేసి... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని జైపాల్ రెడ్డి విమర్శించారు. భూసేకరణ బిల్లును కేసీఆర్‌ ఎందుకు సమర్థిస్తున్నారని ఆయన నిలదీశారు. భూసేకరణబిల్లుపై కోర్టులో మోదీకి ఓటమి తప్పదని జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మొదటి నుంచి కేసీఆర్ మోదీతో కలవడానికి అసక్తి చూపారని ఆయన పేర్కోన్నారు. అబ్బదాలు చెప్పడంలో కేసీఆర్ మోడీని మించిపోతున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jaipal reddy  narendra modi  KCR  JK  

Other Articles