Federal appeals court denied Barack Obamas controversial immigration actions | Barack Obama News

Federal appeals court denied barack obamas controversial immigration actions

Barack Obama news, Barack Obama updates, Barack Obama immigration actions, Barack Obama federal court, texas court, us controversies, Barack Obama controversies

Federal appeals court denied Barack Obamas controversial immigration actions : A federal appeals court on Tuesday denied a request from Justice Department lawyers to allow President Barack Obama's controversial immigration actions to go into effect pending appeal. The decision is a victory for Texas and 25 other states that are challenging the Obama administration's actions, which were blocked by a District Court judge in February.

ఒబామా ‘కరుణ’ నిర్ణయాన్ని తిప్పికొట్టిన యూఎస్ కోర్టు

Posted: 05/27/2015 10:44 AM IST
Federal appeals court denied barack obamas controversial immigration actions

అగ్రరాజ్యానికి రారాజు అయిన బరాక్ ఒబామాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన తీసుకున్న ఓ అరుదైన నిర్ణయాన్ని యూఎస్ కోర్టు తిప్పికొట్టింది. అక్రమంగా దేశంలో వుంటున్న వారిపై కరుణ చూపాలని ఒబామా నిర్ణయం ప్రకటించగా.. యూఎస్ అపీల్ కోర్టు దానిని వ్యతిరేకించింది. న్యూ ఓర్లెన్స్ లోని కోర్టు ఒబామా అడ్మినిస్ట్రేషన్ విభాగం చేసిన విజ్ఞప్తిని వ్యతిరేకిస్తూ ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది.

అమెరికాలో సుమారు 40 లక్షల మంది అక్రమంగా నివసిస్తుండగా.. వారందరినీ వారి దేశాలకు వెనక్కు పంపకుండా క్షమించాలని ఒబామా ఆలోచన. ఇందుకోసం గత నవంబరులోనే ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను కూడా జారీ చేశారు. ఇది ఫిబ్రవరి 2015లోనే అమలు కావాల్సి వుండేది. కానీ.. ఇంతలోనే టెక్సాస్ కోర్టు కల్పించుకుని అత్యవసర ఇన్ జంక్షన్ ఆదేశాలిస్తూ.. ఒబామా జారీచేసిన ‘కరుణ’ ఆర్డర్ పై విచారణ జరపాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే విచారణ చేపట్టిన అనంతరం న్యూ ఓర్లెన్స్ లోని కోర్టు.. ఆ ఆర్డర్ ను వ్యతిరేకిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు ఈ విధంగా జారీ చేసిన ఆదేశాలను డెమోక్రాట్ ప్రతినిధి న్యాన్సీ పెలోసీ తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలు తమకు నిరుత్సాహాన్ని కలిగించాయని ఆమె అన్నారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మరింత పారదర్శకత తేవాలని చేస్తున్న ప్రయత్నాలకు అడ్డంకులు వస్తాయని ఆమె చెప్పారు. మరోవైపు.. హౌస్ స్పీకర్ జాన్ బోయిహ్నర్ మాత్రం కోర్టు ఆదేశాలను సమర్థించారు. ఎగ్జిక్యూటివ్ జారీ చేసే అర్హత ఒబామాకు లేదని స్పష్టం చేశారు. మరి.. దీనిపై ఒబామా స్పందన ఎలా వుంటుందో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Barack Obama  immigration actions  us federal court  

Other Articles