google to launch new nexus smartphone with extra battery backup and good ram

Google to launch new nexus smartphone with extra battery backup

google, google nexus phones, google nexus smartphones, google news, google updates, android smartphones, smartphones, smartphones costs

google to launch new nexus smartphone with extra battery backup : Google to launch new nexus smartphone which contains extra battery backup app and good working ram facilities.

స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ‘గూగుల్’ శుభవార్త!

Posted: 05/27/2015 10:15 AM IST
Google to launch new nexus smartphone with extra battery backup

ప్రస్తుతకాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం ఏమేర వుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దపెద్ద ప్రైవేట్ కంపెనీలు సైతం తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడంలో వీటిని నిత్యం ఉపయోగిస్తుంటారు. ఇంతటి నిత్యవసరమైన ఈ స్మార్ట్ ఫోన్ లో ఒక్క చిన్న లోపం వుంటుంది. అదే ‘బ్యాటరీ బ్యాకప్’! స్మార్ట్ ఫోన్ నిత్యవసరం కాబట్టి.. దాని బ్యాటరీ బ్యాకప్ కోసం పవర్ బ్యాంకును లేదా చార్జర్ ను చేత్తో పట్టుకుని ఖచ్చితంగా తిరగాల్సిందే! అలాగే.. ‘ర్యామ్’ పనితీరు కూడా కొన్ని ఫోన్లలో అంత సమర్థవంతంగా వుండదు. కొన్నిసార్లు ఫోన్ ఆపరేటింగ్ చేస్తుండగానే.. హ్యాంగ్ అయిపోవడం జరుగుతుంది. అయితే.. ఇకనుంచి ఇటువంటి సమస్యలు లేకుండా ‘గూగుల్’ సరికొత్త సాంకేతికతను త్వరలో పరిచయం చేయనుంది.

బ్యాటరీ బ్యాకప్, ర్యామ్ వాడకాలపై దృష్టి సారించిన గూగుల్.. ఆ రెండు సమస్యలను అధిగమించేలా సరికొత్త సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. త్వరలో జరిగే ‘గూగుల్ ఐఓ-2015’వార్షిక డెవలపర్ల సదస్సులో ఆ సాంకేతికతను తొలిసారి పరిచయం చేయనుంది. ‘గూగుల్ ఆండ్రాయిడ్ ఎం’ పేరిట డెవలపర్ ప్రివ్యూ ఇవ్వాలని ఆ సంస్థ ఇప్పటికే నిర్ణయించింది. ఆండ్రాయిడ్ ఎల్, తదుపరి దశలో లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ గా మారినట్లు.. ఈ ఆండ్రాయిడ్ ఎంకు ‘మార్ష్ మాలో’ అని పేరు ఖరారవుతుందని తెలుస్తోంది. అక్టోబర్ లో విడుదలయ్యే నెక్సస్ స్మార్ట్ ఫోన్లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వుంటుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి.

ఇందులో ప్రత్యేకత ఏంటంటే.. స్మోర్ట్ ఫోన్లో ఎన్నడూ చూడలేని బ్యాటరీ బ్యాకప్! అలాగే.. ర్యామ్ పనితీరు సమర్థవంతంగా వుంటుందని తెలుస్తోంది. ఇక వీటితోపాటు ఫింగర్ ప్రింట్ ను గుర్తించి లాక్ ఓపెన్ అయ్యేలా కొత్త యాప్, సరికొత్త వాయిస్ యాక్సెస్, మరింత అభివృద్ధి చేసిన గూగుల్ వాయిస్ సెర్చ్, కొత్త క్రోమ్ కాస్ట్, ఫోటోస్ తదితర యాప్ లను గూగుల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇన్ని సౌకర్యాలతో కూడిన ఈ నెక్సస్ స్మార్ట్ ఫోన్ ధర కాస్త ఎక్కువగానే వుండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : google  nexus smartphone  battery power bank  

Other Articles