KCR | OU | Osmania University | Lands | Protest

Trs leaders and cader fearing about the osmania university

KCR, OU, Osmania University, Lands, Protest

TRS leaders and cader fearing about the osmania university. Telangana cm kcr said that the govt will construct houses in the osmania university lands.

ఆ పేరు వింటేనే టిఆర్ఎస్ నేతలకు చమటలు..!

Posted: 05/26/2015 11:03 AM IST
Trs leaders and cader fearing about the osmania university

ఓయు తాజాగా భూముల వివాదంతో రగులుతోంది. ఓయూ పరిసర ప్రాంతాల్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు చేసిన ఒక ప్రకటనతో ఉస్మానియా యుద్ధ భూమిని తలపిస్తోంది. తాజాగా సోమవారం టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి చెందిన స్వాగత్‌గ్రాండ్‌ హోటలపై ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన పలువురు విద్యార్థులు దాడి చేశారు. ఓయూకు చెందిన భూములను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఆక్రమించుకుని హోటల్‌ నిర్మించారంటూ విద్యార్థులు ఈ దాడికి పాల్పడ్డట్టు చెబుతున్నారు. ఉస్మానియాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటం పడేశాయి.


ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన భూముల్లో పేదలకు ఇళ్లను కట్టిస్తామంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనతో ఉస్మానియా మళ్లి భగ్గమంటోంది. ఉస్మానియా భూములను విశ్వ విద్యాలయానికి చెందేలా చూడాలంటూ అటు విద్యార్థులు, ఇటు ప్రతిపక్ష పార్టీలతో పాటు టీజేఏసీ గత వారం రోజులుగా ఆందోళన చేస్తోంది. ప్రతి నిత్యం విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతల ఆందోళనలతో ఉస్మానియా అట్టడుకుతోంది. ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు నాన్‌బెయిలేబుల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు కట్టించడానికి తాము వ్యతిరేకం కాదని, నిజాం ప్రభుత్వ కాలంలో ఉస్మానియాకు కేటాయించిన భూముల్లో సగానికి సగం గురయ్యాయని, ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వాటిని వెనక్కి తేవాలంటూనే..ఉస్మానియా భూములను పరిరక్షించాలని కోరుతున్నారు.

ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన భూములను విశ్వ విద్యాలయానికి ఉపయోపడేలంటూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు నాన్‌బెయిలెబుల్‌ కేసులు పెట్టడంతో ఈ ఆందోళన మరింత తీవ్రరూపానికి దారి తీస్తోంది. విద్యార్థులపై పోలీసులు పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఇదంతా రాజకీయమంటోంది. ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ ప్రతిపక్షాలు, విద్యార్థులు అనవసరమైన రాద్దాంతం చేస్తున్నాయే తప్ప మరొకటి కాదంటోంది. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉస్మానియా విశ్వ విద్యాలయానికి చెందిన భూములలో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారుతోంది. చూడాలి మరి ఉస్మానియా భూముల వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందో..!

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  OU  Osmania University  Lands  Protest  

Other Articles