PM Narendra Modi Open Letter to Indian People | Indian Politics

Pm narendra modi open letter indian people

narendra modi, narendra modi open letter, narendra modi controversies, narendra modi updates, indian people, narendra modi campaign, narendra modi press meet, india country, bjp party updates

PM Narendra Modi Open Letter Indian People : Prime Minister Narendra Modi Open Letter to Indian People. In this letter he told about his one year pm ruling and what their party achieve in this period.

దేశప్రజలకు మోడీ ‘బహిరంగ లేఖ’

Posted: 05/26/2015 10:36 AM IST
Pm narendra modi open letter indian people

నరేంద్రమోడీ.. ఒకప్పుడు సీదాసాదా రాజకీయ నాయకుడు! అయితే.. అంతలోనే ఈయన కెరీర్ మలుపు తిరిగింది. అప్పటివరకు గుజరాత్ సీఎంగా కొనసాగిన కేషుభాయ్ పటేల్ పాలనపై ఎన్నో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఆయన స్థానంలో మోడీని సీఎంగా పార్టీ ఎన్నుకొంది. అంతే! ఇక అక్కడి నుంచి తన రాజకీయ ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ ముందుకు దూసుకెళ్లారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే దేశంలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ సీఎంగా ఎదిగారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో ఎలా నడిపించాలోనన్న విషయాన్ని తన పాలన ద్వారా తెలియపరిచారు. దాంతో ఈయన మూడుసార్లు సీఎంగా ఎన్నికయ్యి రికార్డు నెలకొల్పారు.

అభివృద్ధి అన్న పదానికి మారుపేరుగా నిలిచిన మోడీ.. దేశానికి ప్రధాని అయితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని భావించారు. ఈ మేరకు దేశప్రజలు మోడీకి మద్దతు పలుకుతూ ‘అబ్ కీ బార్ మోడీ సర్కార్’ అని నినాదాలు చేశారు. దీంతో బీజేపీ పార్టీ మోడీనే ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకొంది. అంతే! చరిత్ర తిరగరాసే విధంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సీట్లతో గెలుపొందింది. కాంగ్రెస్ చరిత్రను పూర్తిగా తుడిచేసే విధంగా ఘనవిజయం సాధించింది. ఒక రాష్ట్ర సీఎం నుంచి ప్రధానిగా ఎదిగిపోయారు మోడీ! ఇప్పటికి ఈయన ప్రధానిగా పాలన చేపట్టి ఏడాది పూర్తయ్యింది. ఈ క్రమంలో ఆయన దేశప్రజలకు ఓ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన కొన్ని అరుదైన అంశాలను పొందుపరిచారు. ‘నా ప్రియమైన దేశ ప్రజలారా’ అంటూ ప్రారంభమైన ఆ లేఖలో.. తాను తన పరిపాలన కాలంలో చేపట్టిన పథకాలను, చేసిన పనులు, ఇతర ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ లేఖలో ఆయన ఏం వెల్లడించారంటే..

కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో తనకు పేదలు గుర్తుకొస్తారని.. అందువల్లే తాను వారి కోసం జన్ ధన్, అటల్ పెన్షన్, ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకాలను ప్రవేశపెట్టినట్లుగా మోడీ తెలిపారు. తమ ప్రభుత్వం రైతుల పరిహారాన్ని ఒకటిన్నర రెట్లు పెంచిందని.. అతివృష్టి, అనావృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్న అన్నదాతకు ఎల్లప్పులూ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గుగనుల వేలం ద్వారా రూ.3 లక్షల కోట్లు, రేడియో తరంగాల వేలం ద్వారా రూ.1 లక్ష కోట్లను ఖజానాకు చేర్చిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానిదేనని అన్నారు. ‘మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా’ వంటి పకాల ద్వారా యువతకు మరింత మెరుగైన ఉపాధి అవకాశాలను దగ్గర చేశామని మోడీ పేర్కొన్నారు. ముద్రా బ్యాంకు ఏర్పాటుతో చిన్న, మధ్యతరహా కంపెనీలకు రూ.10 లక్షల వరకూ బ్యాంకు రుణాలను దగ్గర చేశామని ఆయన వివరించారు. విదేశాల్లో నల్లధనం దాచుకున్న వారిని చట్టం ముందు నిలిపేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.

ఈ క్రమంలో ‘స్వచ్ఛభారత్’ ముఖ్య ఉద్దేశం గురించి ప్రస్తావిస్తూ.. ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది ఆడపిల్లలు బహిర్భూమికి వెళ్లకుండా చూడటమేనని అన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు లేని కారణంగా అమ్మాయిలు చదువు మానుకునే పరిస్థితి రాకూడదని ఆయన చెప్పారు. అందుకే.. ‘ఆడపిల్లలను రక్షించండి.. చదివించండి’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామన్నారు. ప్రతి గ్రామాన్ని ‘డిజిటల్ కనెక్టివిటీ’లో భాగం చేస్తామని అన్నారు. ప్రపంచదేశాలతో పోటీగా దేశం ముందుకెళ్లడానికి సిద్ధంగా వుందని చెప్పిన ఆయన.. ప్రజలు కలిసి రావాలని కోరారు. ఈ విధంగా తన ప్రసంగంతో ప్రజలకు ఉత్తేజపరిచిన ప్రధాని మోడీ.. ‘మీ సేవకే అంకితం.. జైహింద్’ అంటూ ముగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra modi  Bjp party  indian people  

Other Articles