MLC | AP | Telangana | TRS | Congress

Mlc elections in telangana will go tough in ap mlc candidate declare unonimously

MLC, AP, Telangana, TRS, Congress

MLC elections in telangana will go tough. In ap mlc candidate declare unonimously. TRS, Congress party are majorly in the competetion in telanagana mlc.

ఆంధ్రాలో సైలెంట్.. కానీ తెలంగాణలో సై అంటే సై

Posted: 05/26/2015 08:41 AM IST
Mlc elections in telangana will go tough in ap mlc candidate declare unonimously

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్నికల వేడిని పుట్టించిన ఎమ్మెల్సీ ఎన్నికల మీద రెండు రాష్ట్రాల్లో చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో ఆరు, ఆంధ్రలో నాలుగు శాసన మండలి స్థానాలకు నామినేషన్ల ఉప సంహరణ గడువు నిన్నటితో ముగిసింది. ఆంధ్రలో నాలుగు స్థానాలకు నలుగురు ఆభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. ఇక తెలంగాణలో ఆరు స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు రంగంలో నిలిచారు. టిర్‌ఎస్ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు, టిడిపి నుంచి ఒకరు రంగంలో నిలిచారు. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, బి వెంకటేశ్వర్లు, యాదవరెడ్డి, నేతి విద్యాసాగర్‌లు టిఆర్‌ఎస్ నుంచి రంగంలో నిలువగా, కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టిడిపి నుంచి వేం నరేందర్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం కాంగ్రెస్ నాయకులు తీవ్రంగానే ప్రయత్నించారు. కాంగ్రెస్ శాసన సభాపక్షం నాయకుడు కె జానారెడ్డి టిఆర్‌ఎస్ ఎంపి కె కేశవరావును కలిసి ఏకగ్రీవంగా ఎన్నిక జరపడానికి ప్రయత్నించారు. ప్రయత్నం విఫలం కావడంతో తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఓటర్ల జాబితాపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావుతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యేకు ఓటు హక్కు లేదు అనేది టిడిపి ఫిర్యాదు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. జూన్ ఒకటిన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితాలు వెలువడతాయి. మండలి ఎన్నికలపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకులతో ఎలాంటి సమీక్ష జరపలేదు. అయితే ఓట్ల కేటాయింపు ఎలా ఉండాలి, ప్రాధాన్యతా ఓట్ల కేటాయింపుపై బాధ్యులు వ్యూహ రచనలో ఉన్నారని పార్టీ నాయకులు తెలిపారు. విప్‌కు విలువ లేని ఎన్నికలు కావడంతో అధికార పక్షానికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC  AP  Telangana  TRS  Congress  

Other Articles