Modi | Ache din | Rally | Madhura

Modi clear that bad days by the nda govt

Modi, Ache din, Rally, Madhura, Rahul gandhi, NDA

Modi clear that bad days by the nda govt. He attacked on opposition party and Rahul Gandhi. His very attaractive in the Madhura rally.

అవును.. చెడ్డరోజులే వచ్చాయి: మోదీ

Posted: 05/26/2015 08:33 AM IST
Modi clear that bad days by the nda govt

టైటిల్ చూడగానే కాస్త గందరగోళంగా అనిపించిందా.? కానీ నిజం. ముందు నుండి అచ్చే దిన్ అంటే మంచి రోజులు రానున్నాయి అంటూ వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ చెడ్డరోజులే వచ్చాయి అంటూ వెల్లడించారు. అయితే ఇక్కడ చిన్న మెలిక ఉంది.. ఏంటీ అంటారా..? ఆ చెడ్డ రోజులు ప్రతిపక్షం వాళ్లకట. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో 'జన కల్యాణ్‌ పర్వ' సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమ ప్రభుత్వానికి ఏడాది పూర్తయిందని, ఈ ఏడాది కాలంలో ఒక్క స్కాం కూడా జరగలేదని పేర్కొన్నారు. కృష్ణుడు జన్మంచిన పుణ్యస్థలం మధుర అని పేర్కొన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో మన పనిని మనం చేసుకుంటూ వెళ్లాల్సిందేనని ఉద్భోదించారు. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి ప్రజలు ఏడాది క్రితం నిర్ణయం తీసుకున్నారన్నారు. గాంధీ, లోహియా, దీన్‌దయాళ్‌ వంటి మహానుభావుల ఆలోచనలను పంచుకొని ముందుకు పోవాల్సిన అవసరముందన్నారు.

దాదాపు గంటపాటు సాగిన ఈ ప్రసంగంలో మోడీ చాలా భాగం తమ ప్రభుత్వం పేదలకు అనుకూలమైనదని చెప్పుకునేందుకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇది సూట్ బూట్ కా సర్కార్ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు మోడీ ప్రయత్నించారు. దేశాన్ని దోచుకున్నవారికి ఇప్పుడు చెడ్డరోజులు వచ్చాయని ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎదురుదాడికి దిగారు. ఇదివరకటి ప్రభుత్వ హయాంలో రోజుకొక స్కామ్ జరిగేదన్నారు. నేను ప్రధానమంత్రిని కాను, నేను ప్రధాన సంత్రిని (సంరక్షకుడిని) అని మోడీ చెప్పుకున్నారు. ప్రధానిగా 365 రోజులు పూర్తయిన సందర్భంగా నివేదిక ఇచ్చేందుకు తాను మధుర సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో ఉన్నానని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న రెండు వందల ర్యాలీలలో ఇది మొదటిదని ఆయన చెప్పారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Ache din  Rally  Madhura  Rahul gandhi  NDA  

Other Articles