Venkiah niadu | ap | special status

Central minister venkiah niadu clear that ap dont have the eligibility to get special status

Venkiah niadu, ap, special status, eligibility, Jaitly,

Central minister Venkiah niadu clear that ap dont have the eligibility to get special status. Venkiah nidu said that the central govt opens discussions on ap special status.

ఏపికి ప్రత్యేక హోదా అర్హతే లేదు.. కుండబద్దలుకొట్టిన వెంకయ్య

Posted: 05/25/2015 10:38 AM IST
Central minister venkiah niadu clear that ap dont have the eligibility to get special status

అసలు విషయం తేలిపోయింది.. ఇన్నాళ్లు సన్నాయి నొక్కుళ్లు నొక్కిన ఎన్డీయే సర్కార్ ఏపికి ప్రత్యేక హోదా కల్పనపై కుండ బద్దలు కొట్టింది. కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఏపికి తీరని అన్యాయం జరిగింది.. మేం అధికారంలోకి వచ్చాక అంతా చక్కదిద్దుతాం అని చెప్పిన నాటి నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నా ఏమీ చెయ్యకుండా ఉన్నారు. పైగా మేం చెప్పిందే వేదం అన్నట్లు వాదిస్తున్నారు. నిన్న ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తామంటూ ప్రత్యేక హోదా హుళుక్కే అన్న సిగ్నల్స్ పంపిన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఆంధ్రులకు బాధ కలిగించాయి. అయితే తాజాా వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు అసలు విషయాన్ని తేల్చేశాయి. అసలు ఏపికి ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎలాంటి అర్హతలు లేవంటూ వెల్లడించారు. కానీ చివర్లో మాత్రం తుది నిర్ణయం మాత్రం అరుణ్ జైట్లీదే అన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఒక్క ఆర్థిక లోటు తప్ప ఇతర కారణాలేమీ కనిపించడం లేదని వెంకయ్యానాయుడు తెలిపారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి కావాల్సిన అర్హతలేవీ ఏపీకి లేవన్నారు. ఇప్పటికే దేశంలోని కేరళ, తమిళనాడు వంటి ఏడు రాష్ట్రాలు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నాయని గుర్తు చేశారు. వీటన్నింటికీ ప్రత్యేక హోదా ఇవ్వాలంటే సరైన కారణాలుండాలని వివరించారు. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తోందని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాపై చర్చిస్తున్నారని, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.  మిగతా రాష్ట్రాల రాజధానులకు ఇచ్చినట్లుగానే ఏపీ రాజధానికి కూడా నిధులు ఇస్తాం. అంతేకానీ.. ఒకదానికి ఎక్కువ, మరో దానికి తక్కువ అన్న భేదం ఉండదని వెంకయ్య వెల్లడించారు. పైగా ఏపికి  ప్రత్యేక హోదా రాకపోవడం యూపీఏ పాపమే. రాజ్యసభలో చట్టంలో పెట్టాలని డిమాండ్‌ చేశాను. అందుకు కాంగ్రెస్‌ అంగీకరించలేదు. అప్పటి కేంద్ర ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి వ్యతిరేకించాయి. అప్పుడే చట్టంలో పెట్టి ఉంటే హోదాకు ఎటువంటి ఇబ్బందులూ ఉండేవి కాదు. అందుకే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సన్నాయంటూ నొక్కుళ్లు నొక్కారు.
(Source: Andhrajyothy)


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkiah niadu  ap  special status  eligibility  Jaitly  

Other Articles