jayalalitha | Tamilnadu | Pledge

Jayalalitha return as tamilnadu cm today

jayalalitha, Tamilnadu, Pledge

Jayalalitha return as tamilnadu cm today. Jayalalitha will pledge as the cm of tamilnadu.

మమ్మి రిటర్న్@ తమిళనాడు సిఎం

Posted: 05/23/2015 08:15 AM IST
Jayalalitha return as tamilnadu cm today

జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఏఐఏడిఎంకె అధినేత్రి జయలలిత ఈ ఉదయం11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మద్రాస్‌ యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియంలో జయలలిత చేత గవర్నర్‌ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయిస్తారు.నిన్న సిఎం పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా చేయడంతో ప్రమాణ స్వీకారానికి జయలలితను గవర్నర్‌ రోశయ్య ఆహ్వానించారు. గవర్నర్‌ పిలుపుతో రాజ్‌భవన్‌కు వెళ్లిన జయలలిత తనతోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు రాజ్‌భవన్‌ వరకూ ఆమెను అనుసరించారు. 217 రోజుల తర్వాత మొదటిసారిగా ఆమె దర్శనమిచ్చారు.దాదాపు 8 నెలల అనంతరం ఆమె తమిళనాడు సిఎంగా మరోసారి పదవి చేపడుతున్నారు. రూ.66.66 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సెప్టెంబర్‌ 27న ప్రత్యేక కోర్టు జయలలితకు శిక్ష విధించడంతో సిఎం పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

జయ సారథ్యంలో కొత్తగా కొలువుదీరబోయే ప్రభుత్వంలో ముగ్గురు మినహా పాత మంత్రులే కొనసాగనున్నారు. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రులుగా ఉన్నవారిని అలాగే కొనసాగించేందుకు ఆమె మొగ్గుచూపారు. ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం, విద్యుత్ మంత్రిగా నాథమ్ ఆర్ విశ్వనాథన్, గృహ నిర్మాణశాఖ మంత్రిగా ఆర్.వైదిలింగం ప్రమాణం చేయనున్నారు. కీలకమైన హోం, పోలీసు, పబ్లిక్, ఆల్ ఇండియా సర్వీసెస్, సాధారణ పాలన వంటి శాఖలను జయ తన వద్దే ఉంచుకున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  Tamilnadu  Pledge  

Other Articles