Jayalalitha | Cm | Governor | Roshiah

Very very good time to jayalalitha governor roshiah call jayalalitha to form govt in tamilnadu

Jayalalitha, Cm, Governor, Roshiah

Very very good time to jayalalitha. Governor Roshiah call Jayalalitha to form govt in tamilnadu.

అన్నీ మంచి శకునములే...

Posted: 05/22/2015 10:46 AM IST
Very very good time to jayalalitha governor roshiah call jayalalitha to form govt in tamilnadu

అన్నీ మంచి శకునములే అనగానే ఏదో తెలుగు సినిమా పాట గుర్తుకువచ్చిందా. కానీ ఇది తెలుగు వారికి చెందిన వార్తకాదు తమిళనాడుకు చెందిన వార్త. విషయం ఏమిటంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అన్నీ కలిసి వస్తున్నాయి. ఎంతో కాలంగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్న ఆమెకు కర్ణాటక హైకోర్ట్ ఏకంగా క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఎన్నో నెలలుగా జైలులో శిక్ష అనుభవిస్తున్న జయలలితకు నిజంగా శుభవార్తే. తర్వాత జైలు నుండి విడుదలైన అమ్మ.. తిరిగి సిఎం పీఠం ఎక్కడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలు కూడా అమ్మకు మళ్లీ సిఎం కుర్చీ కట్టబెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

జయలలితకు మళ్లీ సిఎం కుర్చీ దక్కకూడదని అక్కడి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అలాంటి ప్రయత్నాలు ఫలించడం లేదు. కరుణానిధి అండ్ కో కూడా జయలలిత మీద తిరిగి ఇప్పటికే కోర్టులో కేసులు వేసినా నిలవడం లేదు. ఏమైనా జయలలిత టైం సూపర్ గా నడుస్తున్నట్లుంది అందుకే ఎవ్వరెన్ని ట్రిక్కులు వేస్తున్నా అవి మాత్రం పనిచేయడం లేదు. తాజాగా పన్నీర్ సెల్వం సిఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య జయలలితను  ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించారు. అంతే ఇంకేముంది ఫార్మాల్టి కనుక కంప్లీట్ ఐతే రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత మరోసారి గద్దెకెన్ననున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha  Cm  Governor  Roshiah  

Other Articles