AirAsia Adds New Route, Fares Start At Rs 1 Per Km | Air Asia Airlines

Airasia new offer adds new route fares start rs 1 per km

AirAsia news, AirAsia offers, AirAsia new offers, AirAsia fares, AirAsia staff, AirAsia air hostess

AirAsia New Offer Adds New Route Fares Start Rs 1 Per Km : AirAsia will start flying from Bengaluru to Vishakhapatnam from next month and as part of an inaugural offer, customers can book tickets on the route at Rs 1 per km, the airline said.

రండి బాబు రండి.. ఒక కిలోమీటర్ కు ఒక్క రూపాయి మాత్రమే!

Posted: 05/22/2015 10:12 AM IST
Airasia new offer adds new route fares start rs 1 per km

ప్రస్తుతరోజుల్లో ప్రతిరంగంలోనూ పోటీ భీబత్సంగా వుంది. ముఖ్యంగా విమానయానరంగంలో అయితే ఈ పోటీ తారాస్థాయికి చేరిపోయింది. అందుకే.. జనాలను తమవైపుకు ఆకర్షించుకునేందుకు తమదైన పంథాల్లో ఆఫర్లు ప్రకటించేస్తున్నారు. ప్రయాణికులకు అనుకూలంగా మరిన్ని సౌకర్యాలు కల్పించడం.. టికెట్ ధరలను తగ్గించడం.. లాంటి ఆఫర్లను పోటాపోటీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఏయిర్ ఏషియా సరికొత్త ఆఫర్ తో ముందుకొస్తూ జనాలను ఆకర్షించే ప్రయత్నంలో మునిగిపోయింది.

ఒక కిలోమీటర్ కు ఒక రూపాయి మాత్రమే చెల్లించండి అంటూ సరికొత్త ఆపర్ ని ప్రకటించింది ఏయిర్ ఏషియా! నిజానికి ఏసీ వోల్వో బస్సుల్లోనే ఒక కిలోమీటర్ లో రూపాయిన్నరకు పైగానే రవాణా వసూలు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో రూపాయికి కిలోమీటర్ దూరం ప్రయాణించండని ఎయిర్ ఏషియా వినూత్న ఆఫర్ ప్రకటించడం విశేషంగా మారింది. బెంగుళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ.. ఢిల్లీ నుంచి సర్వీసులను ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త ఆఫరును ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఈనెల 24 వరకూ ఈ ఆఫర్ ను వాడుకొని టికెట్లను బుక్ చేసుకోవచ్చని, ప్రయాణ తేదీ జూన్ 18 నుంిచ వచ్చే మే 31 మధ్య వుండాలని వెల్లడించింది.

ఈ ఆఫర్ లో భాగంగా బెంగుళూరు నుంచి విశాఖపట్నానికి తిరిగే ఎయిర్ ఏషియా విమానంలో అన్ని పన్నులు కలుపుకుని కేవలం రూ.1400కే విమాన ప్రయాణం చేయవచ్చు. ఢిల్లీ నుంచి బెంగుళూరు, గోవా, గౌహతి సర్వీసులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్ ఏషియా చెన్నై, కొచ్చి, గోవా, చండీగఢ్, జైపూర్, పుణె నగరాల నుంచి విమాన సర్వీసులను నిర్వహిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  Indian Airlines  

Other Articles