Telangana | Ap | Temperature

Record level high temperature in telugu states and people are suffering from heat

Telangana, Ap, Temperature

record level high temperature in telugu states and people are suffering from heat. Nearly 96 people died in Telangana and andhrapradesh.

మండుతున్న ఎండలు.. పిట్టల్లా రాలుతున్న జనాలు

Posted: 05/22/2015 08:00 AM IST
Record level high temperature in telugu states and people are suffering from heat

ఎండలు మండుతున్నాయి అని చెప్పడం కూడా సరిపోనంతలా భానుడు భగభగ మండుతున్నాడు. దాంతో జనం పిట్టల్లా రాలుతున్నారు. మండు టెండలతో తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. గడిచిన ఐదేళ్ళుగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వేసవి తీవ్రత విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాలపై భానుడు కన్నెర్ర చేశాడు. ఫలితంగా వడదెబ్బకు ఒకే రోజు 96మంది మృత్యువాత పడ్డారు. తెలంగాణాలో 61మంది, ఆంధ్రప్రదేశ్‌లో 35మంది మృతి చెందినట్లు జిల్లాల నుంచి అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. తెలంగాణాలో ఎండల తీవ్రత ఊహించనంతగా పెరిగిపోయింది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 14మంది వడదెబ్బకు మరణించారు.

నల్గొండ జిల్లాలో 13మంది, ఆదిలాబాద్‌ జిల్లాలో 10మంది, కరీంనగర్‌ జిల్లాలో 8మంది, మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నలుగురు, మెదక్‌ జిల్లాలో ఆరుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్ధరు, వరంగల్‌ జిల్లాలో ఇద్దరు వడదెబ్బ సోకి మృత్యువాత పడ్డారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భానుడు భగ్గుమన్నాడు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున వడదెబ్బకు మరణించారు. ఉక్కపోత రెట్టింపయ్యింది. దీంతో జనం విలవిల్లాడుతున్నారు. ఉదయం 8గంటల నుంచే జనం ఇళ్ళల్లోంచి బయటకు రావడానికి జంకుతున్నారు. ఏపీలోని విజయవాడ, నెల్లూరులలో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇటు తెలంగాణాలోని కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెవదక్‌ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను చేరుకున్నాయి. ఎన్నడూ 44 డిగ్రీలు దాటని హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రత 45 డిగ్రీలను దాటింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Ap  Temperature  

Other Articles