Maoists | Naxals | Hepicopter

Maoists getting ready to manufacture the mini size helicopters in kerala and bihar

Maoists, Naxals, Hepicopter, Police, Bihar

Maoists getting ready to manufacture the mini size helicopters in kerala and bihar. Police got evidence about this, in the dairy of maoist leader.

మావోలా.. మజాకా.. మినీ హెలికాప్టర్ల తయారీ..!?

Posted: 05/22/2015 08:15 AM IST
Maoists getting ready to manufacture the mini size helicopters in kerala and bihar

ఒకప్పుడు కత్తులు, బాకులు తర్వాత తర్వాత పిస్టల్స్ ఇప్పుడు ఏకంగా మినీ హెలికాప్టర్లలను సిద్దం చేసుకుంటున్నారు మావోయిస్టులు. అవును మారుతున్న ట్రెండ్ కు తగ్గట్టుగా మావోలు కూడా మారుతున్నారు. అందులో భాగంగానే పోలీసులకు ధీటుగా తమ కెపాసిటిని పెంచుకుంటున్నారు. తాజాగా మినీ హెలికాప్టర్ల తయారీపై మావోయిస్టులు దృష్టి పెట్టారు. స్వల్ప బరువు, తక్కువ సామర్థ్యం కలిగినవాటిని రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్టు బిహార్, కేరళల్లో జరిగిన ఆపరేషన్ల సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాలతో వెలుగులోకొచ్చింది.

అడవులు, కొండల్ని దాటేందుకు అనువుగా, ఇద్దరు కూర్చునేలా  డిజైన్ చేస్తున్నారు. ఓ సంస్థకు చెందిన ద్విచక్ర వాహ నం ఇంజన్‌తో నిర్మించేలా సిద్ధం చేసిన డిజైన్...బీహార్‌లోని గయ ప్రాంతంలో సీఆర్పీఎఫ్  అధికారులకు లభించింది. విధ్వంసాల కోసం వీరంతా ఎక్కువగా మందుపాతరల్నే ప్రయోగిస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా రిమోట్ కంట్రోల్ బాంబుల తయారీకీ యత్నిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. కేరళ పోలీసులు అరెస్టుచేసిన  ఐదుగురు మావోల డైరీలో ఈ సమాచారం ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఇప్పటికే మావోలతో తల ప్రాణం తోకలోకి వస్తున్న పోలీసులకు మరిన్ని కష్టాలు తప్పవు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists  Naxals  Hepicopter  Police  Bihar  

Other Articles