B.C. man's elephant selfie in Thailand goes viral

A rare elphie elephant takes selfie with vancouver man

B.C. man's elephant selfie in Thailand goes viral, Christian Leblanc Vancouver man, Southeast Asia, feeding elephants, Koh Phangan, Thailand, GoPro camera, elphie best selfie, Sauder School of Business, University of British Columbia, Philippines, worlds greatest elphie, Elephant, trunk, incredible, photo, tourist, Thailand, stealing, viral

A Vancouver man’s adventures in Southeast Asia are receiving some international attention after an elephant used its trunk to grab his camera and took an ‘elphie’.

ఏనుగమ్మ ఏనుగు.. సెల్ఫీ దిగింది ఏనుగు..

Posted: 05/21/2015 03:58 PM IST
A rare elphie elephant takes selfie with vancouver man

మానవ మాత్రలం.. మేము కనిపెట్టిన సాంకేతిక విప్లవంతో మేము అద్భుతాలు చేయగలం.. అంతెందుకు సెల్పీలు తీసుకోగలం అంటూ బీరాలు పోకండి.. ఎందుకంటే.. మనకు మాత్రమే సెల్ఫీలు సొంతం కాదు. అందేంటి సెల్ఫీలు మనుషులు కాకుండా జంతువులు తీసుకుంటాయా...? వాటికి సెల్ పోన్లు, కెమెరాల గురించి ఏం తెలుసు అనుకుంటున్నారా..? ఇక మీకు ఆ సందేహం అవసరం లేదు. ఎందుకంటే మనుషులతో పోటీపడి మరీ.. సెల్ఫీ తీసుకుంది ఓ గజరాజు. కాదు కాదు ఎల్ఫీ. అదేంటి అంటారా..? ఏనుగు తీసుకున్న సెల్పీని.. ఎల్ఫీ అనేగా అంటాం అంటూ నామకరణం కూడా చేశారు.

ప్రపంచంలోనే తొలి ఎల్ఫీని చిత్రం మీరు చూస్తున్నదే. ఇది కెనడాకు చెందిన పర్యాటకుడు క్రిస్టియన్‌ లెబ్లాంక్‌ సందర్శనార్థం థాయ్‌లాండ్‌కు వెళ్లాగా అక్కడ అవిష్కృతమైంది. ఎలా అంటారా.. ? ధాయ్ లాండ్ లోని  కో పనాగ్‌కు వెళ్లిన ఆయన ఓ ఏనుగుకు అరటి పండ్లను తినిపిస్తున్నారు. ఇంతలో పండ్లు అయిపోవడంతో తీసుకురావడానికి వెళ్లారు. ఆ తొందరలో సెల్ఫ్‌ టైమర్‌ ఆన్‌ చేసిన తన కెమెరాను అక్కడే వదిలివెళ్లారు. వెంటనే ఆ ఫోన్‌ను అందుకున్న ‘గజరాజు’ ఇష్టం వచ్చినట్లుగా ఫొటోలు తీసేసింది. కొన్ని ఫొటోల్లో తన బొమ్మ కూడా ఉండటంతో క్రిస్టియన్‌ లెబ్లాంక్‌ ఆనందానికి అవధులు లేవు. ‘ఇది నా జీవితంలోనే అద్భుతమైన ఫొటో’ అని ఆయన ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఇప్పుడు ఇది సోషల్ నెట్ వర్క్ లో హాట్ టాపిక్ గా కోనసాగుతూ.. ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కోడుతోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elphie  Elephant takes selfie  Thailand  viral  

Other Articles