telangana | contract | regularisation | kcr | employees

Telangana govt proposals to regularise the contract services

telangana, contract, regularisation, kcr, employees

Telangana govt proposals to regularise the contract services. Cm kcr already collect all the information about the contract employees.

కాంట్రాక్ట్ ఉద్యోగులకు పండగే.. జూన్2 న శుభవార్త..!

Posted: 05/21/2015 08:40 AM IST
Telangana govt proposals to regularise the contract services

ఎంతో కాలంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కల తొందరలోనే నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలొ భాగంగా తెలంగాణ సర్కార్ ఆ మేరకు చర్యలకు దిగినట్లు సమాచారం. అయితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవ కానుకగా ఈ విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 28 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు లబ్ధి పొందుతారని ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని.. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తామని కేసీఆర్ గతంలో మాటిచ్చారు. తాజాగా 4300 మంది ఆర్టీసీ కార్మికులను రెగ్యులర్ చేసిన కేసీఆర్ ఇక మిగిలిన ఉద్యోగులను రెగ్యులర్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలంగాణలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరించింది. దాదాపుగా 28 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరించిన ప్రభుత్వం అందులో రెగ్యులర్ చెయ్యడానికి ఎంత మందికి అవకాశాలు, అర్హతలు ఉన్నాయన్న విషయంపైనా సమాలోచనలు చేసింది. దాదాపుగా అన్ని ఫార్మాల్టిలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజ్ ఫైల్ పై సిఎం కేసీఆర్ సంతకం ఒక్కటే తరువాయి అని సమాచారం. జూన్ 2 తెలంగాణ రాఫ్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త వినిపిస్తుందని సమాచారం.

కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యడానికి వేసిన కమిటీ సిఫారసు చేసిన నిబంధనల ప్రకారం...
*రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం నాటికి అంటే గత ఏడాది జూన్ 2 నాటికి అయిదేళ్ల సర్వీసు నిండిన కాంట్రాక్టు ఉద్యోగులను ముందుగా రెగ్యులరైజ్ చేస్తారు.
*రెండో విడతలో అయిదేళ్లు నిండని అభ్యర్థులను పరిగణనలోకి తీసుకుంటారు. అయిదేళ్ల పాటు కాంట్రాక్టు ఉద్యోగులుగానే గుర్తించి.. తర్వాతే రెగ్యులర్ అయ్యే అవకాశం కల్పిస్తారు.
*ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరికీ ఈ క్రమబద్ధీకరణ పథకం వర్తిస్తుంది.
*ప్రత్యేక ప్రాజెక్టులు, స్కీముల కింద పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు వర్తించదు. అంటే... నెలనెలా ప్రభుత్వం ఫుల్ టైమ్ స్కేల్ అందుకుంటున్న వారినే ఇందుకు అర్హులుగా పరిగణిస్తారు.
*ప్రస్తుతం పనిచేస్తున్న పోస్టులకు సరిపడే విద్యార్హత, వయసు నిబంధనలున్న అభ్యర్థులకే అవకాశమిస్తారు.
*ఆయా విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టుల సంఖ్య మేరకే ఈ నియామకాలుంటాయి.
*రిజర్వేషన్లు, రోస్టరు పద్ధతిని సైతం అనుసరిస్తారు. పార్ట్ టైం, డైలీ వేజ్ కార్మికులు సైతం ఈ క్రమబద్ధీకరణ పరిధిలోకి రారు.
*క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే ప్రభుత్వ సర్వీసు మొదలవుతుందని.. గతంలో పని చేసిన సర్వీసు లెక్కలోకి రాదని కమిటీ నిర్ణయించింది.
(Source: Sakshi)

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : telangana  contract  regularisation  kcr  employees  

Other Articles