Council | mlc | telangana | ap

Council notification get heat in both telugu states

Council, mlc. telangana, ap, trs, tdp

Council notification get heat in both telugu states. In ap offiically announce the list of the candidates who will contest for mlc. In telangana trs party mlc contest names out.

పదవులు బాబోయ్ పదవులు.. పట్టుకోండి

Posted: 05/21/2015 07:51 AM IST
Council notification get heat in both telugu states

ఏఫి మండలి బరిలోనిలిచేందుకు అన్ని పార్టీలు అభ్యర్థులను వెల్లడించాయి. ఇక ఎలాగైనాసరే పదవులను పొందాలని ఆశిస్తున్న వారి పైరవీలకు అంతేలేదు. అన్ని పార్టీలు దాదాపుగా పార్టీల అభ్యర్థులను ఖరారు చేశాయి. ఏపి టిడిపి తరఫున ఎమ్మెల్సీ బరిలో దిగనున్న అభ్యర్థులు..ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు సీట్లకు ఎంఏ షరీఫ్‌ (పశ్చిమ గోదావరి), జూపూడి ప్రభాకరరావు (ప్రకాశం), గవర్నర్‌ కోటా కింద నాలుగు సీట్లకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి(నెల్లూరు), పంచుమర్తి అనురాధ(విజయవాడ), టీడీ జనార్థనరావు(కృష్ణా), గౌనివారి శ్రీనివాసులు(చిత్తూరు) ఎంపికయ్యారు.
 
ఇటు తెలంగాణలోనూ ఎమ్మెల్సీల హడావిడి కొనసాగుతోంది.  అధికార టీఆర్‌ఎస్‌లో మండలి అభ్యర్థులు ఎవరో దాదదాపుగా తెలిసినపోయింది.  అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా, ఎమ్మెల్సీలుగా పోటీ పడనున్న వారి పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ పేర్లను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు బుధవారం ఆరుగురు నేతలు నామినేషన్ పత్రాలను భర్తీ చేశారు. గురువారం వీరంతా వాటిని దాఖలు చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు కె.యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకుడు, పార్టీ కార్యాలయ కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలు భర్తీ చేశారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను తేలిగ్గా గెలుచుకుంటుంది. కాంగ్రెస్‌కు ఒక స్థానంలో విజయం సాధించేందుకు వీలుగా ఎమ్మెల్యేల సంఖ్య ఉంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Council  mlc. telangana  ap  trs  tdp  

Other Articles