danam nagender resigns to congress party..?

Danam writes letter to digvijay resigns to party

danam nagender, Telangana congress, hyderabad city congress president, former minister danam resigns to the party, sabitha Indra reddy, D.srinivas, divijay singh, congress party, greater elections, GHMC elections, jayasudha, resigns to congress party

another set back to telangana congress.. as hyderabad city president and former minister resigns to the party

కాంగ్రెస్ పార్టీకీ గుడ్ బై చెప్పనున్న దానం..? కాంగ్రెస్ లో ఆగమాగం..

Posted: 05/20/2015 09:13 PM IST
Danam writes letter to digvijay resigns to party

తెలంగాణ రాష్ట్రంలో అదనంగా వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలోని లుకలుకలను బయటపెట్టాయి. గతంలో అమాత్యులుగా ప్రజల ఆదరాబిమానాలు పోందిన నేతలు.. ఇప్పడు తమను పలకరించే వారు లేక.. ఏ పదవి వచ్చినా తమకే కావాలని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక్కగానోక్క ఎమ్మెల్సీ సీటుకు తమ పేరును ఖరారు చేయాల్సిందింగా.. ఎవరికి వారు అధిష్టానం వద్ద లాభియింగ్ కు పాల్పడ్డారు. పదేళ్ల పాటు కోనసాగిన అధికారం ఒక్కసారిగా పోవడంతో.. అందివచ్చిన అవకాశ్ని అందిపుచ్చుకునేందుకు పదుల సంఖ్యలోనే నేతలు ప్రయత్నాలు చేశారు. అయితే ఎట్టకేలకు ఎమ్మెల్సీ స్థానానికి ఆకులు లలిత పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడంతో.. పార్టీలో లుకలుకలు భయటపడ్డాయి.

ఎమ్మెల్సీ తన కన్నా సినియర్లు రాష్ట్ర మాజీ పిసీసీ ఇంచార్జ్ డి.శ్రీనివాస్ లేదా మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిలకు రిక్త హస్తం అందించడంతో హైదరాబాద్ నగర కాంగ్రెస్ ఇంచార్జ్ దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసినట్లు సమాచారం. అయితే తన రాజీనామాకు గల కారణాలను వివరిస్తూ దానం.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ పంపించినట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సబితా ఇంద్రారెడ్డి లేదా డి.శ్రీనివాస్ లకు ఎమ్మెల్సీ సీటు ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.

హైదరాబాద్ నుంచి తన పేరును ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి పరిశీలించాల్సిందా కూడా కోరానని అయినా అదిష్టానం తనకు కూడా రిక్తహస్తం అందించిందని ఆయన ఆవేదన వెలిబుచ్చినట్లు సమాచారం. మహిళలకే ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని అనుకున్న పక్షంలో కాంగ్రెస్ అధిష్టానం సబితా ఇంద్రారెడ్డిని ఎందుకు పక్కనపెట్టిందని ఆయన నిలదీసారు. సీనియర్లు ముందు గుర్తుంపు ఇచ్చి.. జూనియర్లకు తరువాత అవకాశం ఇవ్వాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం.  అకుల లలిత తరువాత వచ్చే అవకాశాలలో స్థానం ఇచ్చి వుండాల్సిందని దానం అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఇక గ్రేటర్ లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎవరు గెలిపిస్తారో వేచి చూడాలని ఆయన అధిష్టానానికి సవాల్ విసిరినట్లు తెలుస్తోంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : danam nagender  Telangana congress  GHMC elections  

Other Articles