Bihar students cheat in exams by using high-tech gadgets

8 girls among 13 held at bceceb exam

8 girls among 13 held at BCECEB exam, Bihar students, cheat in exams, high-tech gadgets, Bihar, Students, Exams, patna, patna news, patna local news,

Students using unfair means in examinations remain undeterred in Bihar despite the recent hue and cry over cases of widespread cheating in the state.

ఎనమిది అమ్మాయిలు అడ్డంగా బుక్ అయ్యారు..

Posted: 05/19/2015 08:56 PM IST
8 girls among 13 held at bceceb exam

పదో తరగతి పరీక్షల్లో తమ పిల్లలకు చిట్టీలు అందించేందుకు పాట్నాలోని ఒక పాఠశాల వద్ద తల్లిదండ్రులు పడిన ఫీట్లు చూశాం. పరీక్షల ముందు ఏడాది పోడుగునా పిల్లలను పట్టించుకోని తల్లిదండ్రలు తమ పిల్లలు ఎలాగైనా పదో తరగతి పాస్ కావలంటూ.. పరీక్ష హాలు కిటికీల నుంచి చిట్టీలు అందించి మాస్ కాపీయింగ్కు సహకరించి సంచలనం సృష్టించిన ఘటనను మరువక ముందే బీహార్లో మరో హై టెక్ కాపీయింగ్ ఘటన చోటుచేసుకుంది. పరీక్షల నిర్వాహణా అధికారులు అవాక్కయ్యేలాగా దాదాపు పదమూడుమంది హైటెక్ మాస్ కాపీయింగ్కు పాల్పడ్డారు వీరిని అదుపులోకి తీసుకోగా వారిలో అధికంగా ఎనమిది మంది అమ్మాయిలు వున్నారు. వీరందరినీ పోలీసులు అడ్డంగా బుక్ చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. బీహార్ కంబైన్డ్ ఎంట్రెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బోర్డ్ (బిసిఈసిఈబి) పాట్నాలో పలు సెంటర్లలో ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్షలు నిర్వహించగా వాటికి హాజరైన వీరు అత్యాధునిక పరికరాల సహాయంతో పరీక్ష రాస్తూ పట్టుబడ్డారు. పరీక్షలకు సంబంధించి ఒకేసారి ఇంతమంది అమ్మాయిలు అరెస్టు కావడం ఇదే తొలిసారి. పట్టుబడిని ఎనిమిదిమంది అమ్మాయిలది కూడా వేర్వేరు ప్రాంతాలు. వీరి దగ్గరి నుంచి మైక్రో ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, తమకు ఈ విధంగా పరీక్షలు రాసేందుకు సహకరిస్తామని చెప్పిన ముఠాకు పెద్ద మొత్తంలో  డబ్బులు చెల్లించామని అరెస్టు అయిన అమ్మాయిలు వాపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bihar students  cheat in exams  high-tech gadgets  

Other Articles