Philadelphia-based Indian filmmaker Vijay Mohan dies after bike accident in US

Philadelphia filmmaker vijay mohan killed riding bike

Vijay Mohan, Indian-American filmmaker, Temple University, Philadelphia, vijay mohan, indian filmmaker vijay mohan, filmmaker vijay mohan us, vijay mohan death, india news

A 26-year-old aspiring Indian- American filmmaker Vijay Mohan has died over a week after he was hit by a car while riding a bike in his home town of Philadelphia.

చికిత్స పోందుతూ సినీ దర్శకుడు మృతి

Posted: 05/19/2015 01:16 PM IST
Philadelphia filmmaker vijay mohan killed riding bike

గత వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సినీ దర్శకుడు విజయ్ మోహన్ ఇవాళ మృతి చెందారు. భారతీయ సంతతికి చెందిన అగ్రరాజ్యం అమెరికన్ దర్శకుడు విజయ్ మోహన్ (26) ఈ నెల 10వ తేదీ అర్థరాత్రి ఫిలిడెల్ఫియా పట్టణంలో.. ప్రమాదానికి గురయ్యారు. బైక్పై ఫిలిడెల్ఫియా పట్టణ శివార్లలో వెళ్తున్న విజయ్ మోహన్ ను వెనుకగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఆయన ఇవాళ మరణించారు.

విజయ్ మోహన్ చికాగో శివారు ప్రాంతంలో జన్మించారు. ఆయన పాఠశాల విద్య అంతా భారత్లో జరిగింది. అనంతరం ఆయన టెంపల్ యూనివర్శిటీ నుంచి ఫిల్మ్, మీడియా అర్ట్స్ డిగ్రీ తీసుకున్నారు. విజయ్ అంకితభావంతో పని చేస్తాడని ఫిలిడెల్ఫియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కమ్యూనిటీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. విజయ్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అతడి మృతి పట్ల సంతాపం ప్రకటించి, అతని కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేసింది.
 
జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mohan  Indian-American filmmaker  Philadelphia  

Other Articles