abn andhrajyothy | telangana | telecast | KCR

Abn andhrajyothy targets trs leaders in telangana trs govt ban the abn andhrajyothy relay

abn andhrajyothy, telangana, relay, telecast, KCR

Abn andhrajyothy targets trs leaders. In telangana trs govt ban the abn andhrajyothy relay.

టిఆర్ఎస్ నాయకులే ఆ ఛానల్ టార్గెట్.!

Posted: 05/18/2015 12:48 PM IST
Abn andhrajyothy targets trs leaders in telangana trs govt ban the abn andhrajyothy relay

తెలంగాణ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి లపై బహిష్కరణ వేటు వేశారు. అయితే తర్వాత తర్వాత పరిణామాలు మారి టివి9 దాదాపుగా కాళ్ల బేరానకి రావడంతో తెలంగాణలో ఆ చానల్ ప్రసారాలకు అనుమతి లబించింది. కేబుల్ ఆపరేటర్లు టివి9 ఛానల్ ను ప్రసారం చెయ్యడానికి ఒప్పుకున్నారు. అయితే ఎబిఎన్ చానల్ ప్రసారానికి మాత్రం క్లీయరెన్స్ దొరకలేదు. అయితే గత కొంత కాలంగా తెలంగాణలో ఎబిఎన్ ఛానల్ కనిపించకపోవడం.. కయ్యానికి కాలుదువ్వుతోంది ఎబిఎన్. టిఆర్ఎస్ నాయకులు ఎవరు దొరికినా న్యూస్ లో తెగ హడావిడి చేసేస్తోంది.

తెలంగాణలో ఎబిఎన్ ఛానల్ ప్రసారం కాకపోవడంతో యాడ్స్ కు బాగా ఇబ్బంది కలుగుతోంది. అంతేకాకుండా టిఆర్పి రేటింగ్ కూడా తగ్గిసపోతుండటంతో ఎబిఎన్ యాజమాన్యం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్దమవుతోంది. గుళాబి నాయకులు ఎవరు తప్పు చేసినట్లు కనీసం అనుమానం వస్తే చాలు ఎక్స్ క్లూజివ్ పేరుతో కథనాలు ప్రసారం చేస్తోంది. అయితే ఒక్క ఎబిఎన్ లో మాత్రమే కథనాలు ప్రసారం అవుతుండటంతో జనాలకు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ పలానా గుళాబీ నాయకులు అలా చేసి ఉంటే అన్ని ఛానల్స్ లో వచ్చి ఉండేది కదా మరి అన్నింటిలో ఎందుకు రాలేదు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయినా మీడియాలో వార్తలు రావడం దానిపై ఏదోలా స్పందించడం మామూలే. కానీ ఎబిఎన్ లో వస్తున్న కథనాలకు ఏ మాత్రం స్పందించడం లేదు గుళాబి నేతలు. అసలు విషయం ఎబిఎన్ టార్గెట్ టిఆర్ఎస్ నాయకులేనా అంటే ఖచ్చితంగా అవును అన్న సమాధానమే వస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : abn andhrajyothy  telangana  relay  telecast  KCR  

Other Articles