Biker Rival Gang Shooting Leaves Nine Dead 18 Injured in Texas Restaurant | Texas

Biker rival gang shooting leaves nine dead 18 injured in texas restaurant

Biker rival gang shooting, rival gang firing texas, texas restaurant firing incident, texas firing incidents, us texas crime news, biker gang killed 9 members, biker gang firing news

Biker Rival Gang Shooting Leaves Nine Dead 18 Injured in Texas Restaurant : Rival motorcycle gangs turned a local restaurant into a shooting gallery Sunday afternoon and when the gunfire was over, nine people were dead and 18 were injured.

అచ్చిండ్రు.. కాల్చిండ్రు.. పోయిండ్రు!

Posted: 05/18/2015 12:01 PM IST
Biker rival gang shooting leaves nine dead 18 injured in texas restaurant

అప్పటివరకు ఆ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా వుండేది.. అక్కడున్న ప్రజలు తమ ఆనంద ఘడియలు గడుపుతుండేవారు.. కానీ అవే వారి జీవితంలో చివరి క్షణాలు అని ఎవరూ గ్రహించలేకపోయారు. వారి చిరునవ్వులు అక్కడితోనే ఆగిపోతాయని అనుకోలేదు. ఎక్కడో ఏదో ఘర్షణ వారి జీవితాలను ఛిద్రం చేసేసింది. అనుకోకుండా చోటు చేసుకున్న ఓ ఘర్షణ అక్కడున్న తొమ్మిదిమందిని బలితీసుకుంది. దీంతో.. సంతోషంగా వున్న ఆ ప్రాంత వాతావరణం ఆ ఘటనతో విషాదంగా మారింది. ఈ దారుణమైన సంఘటన అమెరికాలోకి టెక్సాస్ లో జరిగింది.

అమెరికాలో ఆదివారం అర్ధరాత్రి  రెండు గంటల ప్రాంతంలో (భారత కాలమాన ప్రకారం) చోటు చేసుకున్న కాల్పుల్లో తొమ్మిదిమంది మృత్యువాత పడ్డారు. ఈ కాల్పులు జరగడానికి కారణం పార్కింగ్ విషయంలో ఘర్షణ చోటుచేసుకోవడమే! టెక్సాస్ లోని వాకా వద్ద ట్విన్ పీక్స్ రెస్టారెంట్ పార్కింగ్ విషయంలో రైవల్ బైకర్ గ్యాంగ్ ఘర్షణకు పాల్పడింది. ఈ ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆ గ్యాంగ్ ఒక్కసారిగా కాల్పులకు పాల్పడింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం!

అతిపాశవికంగా కాల్పులు జరిపి దారుణమైన చర్యలకు పాల్పడిన ఆ గ్యాంగ్ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వాకా పోలీస్ అధికారి పాట్రిక్ స్పష్టం చేశారు. ఆ గ్యాంగ్ ఈ విధంగా కాల్పులు జరపడం వెనుక పార్కింగ్ ఘర్షణే కారణమా.. లేక మరే ఉద్దేశంతో వారు ఈ దాడికి పాల్పడ్డారు అన్న కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Biker rival gang  texas restaurant firing  

Other Articles