Man Brutally Beaten up by Momo Vendor in Delhi for Asking Extra Chutney | New Delhi Crime News

Man beaten up by momo vendor in delhi for asking extra chutney

momo vendor, chutney, man beaten, Lal Bahadur Shastri Hospital, Akash, ICU, trilokpuri blocksection 308, man beaten by momo vendor

Man Beaten up by Momo Vendor in Delhi for Asking Extra Chutney : A 24-year-old man in Delhi is in Intensive Care Unit of a hospital after he was beaten up by a roadside momos vendor, allegedly after asking for extra 'chutney.' The incident took place in Trilokpuri in East Delhi last night.

‘చెట్నీ’ అడిగితే ‘పచ్చడి’ చేసిన హోటల్ యజమాని!

Posted: 05/16/2015 10:29 AM IST
Man beaten up by momo vendor in delhi for asking extra chutney

సాధారణంగా హోటల్ లో టిఫిన్ చేస్తున్నప్పుడు చెట్నీ అయిపోతే ఇంకా కావాలని అడగడం సహజం! అందుకు అనుగుణంగానే హోటల్ యజమానులు కూడా స్పందించి చెట్నీ, ఇతర కర్రీలు వేస్తారు. ఇది ప్రతిఒక్క హోటల్, టిఫిన్ సెంటర్లలో సహజంగా జరిగేవే! కానీ.. ఓ యువకుడు తనకు చెట్నీ కావాలని హోటల్ యజమానిని అడిగినందుకు అతగాడు ఆగ్రహించి ‘పచ్చడి’ కింద కొట్టేశాడు. ఎంతో దారుణంగా కొట్టాడంటే.. దెబ్బలు తిన్న ఆ యువకుడు ప్రస్తుతం ఆసుపత్రి ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన తూర్పు న్యూఢిల్లీలోని త్రిలోక్ పూరి బ్లాక్ 31లో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. సన్నీ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి రోడ్డు పక్కనే వున్న కాకా హోటల్లో టిఫిన్ తింటున్నారు. ఆ క్రమంలో సన్నీ ప్లేట్లో పచ్చడి అయిపోయింది. మళ్లీ పచ్చడి కావాలని హోటల్ యజమాని కమల్ని కోరాడు. అంతే! కమల్ కి కోపం కట్టలు తెంచుకుంది. అక్కడే వున్న రాడ్ తీసుకుని సన్నీపై ఒక్కసారిగా దాడి చేశాడు. విచక్షణరహితంగా కొట్టి ‘పచ్చడి’ చేసేశాడు. దాంతో సన్నీ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇక అక్కడే వున్న అతడి స్నేహితులు ఈ ఘటనను చూసి భయాభ్రాంతులకు గురయ్యారు. ఏం చేయాలో తోచక వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కమల్పై కేసు నమోదు చేశారు. మరోవైపు సన్నీని చికిత్స నిమిత్తం లాల్ బహదూర్ శాస్త్రీ ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాలైన నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలావుండగా.. సన్నీని దారుణంగా కొట్టిన కమల్ వాదన మరోరకంగా వుంది. సన్నీ చెట్నీని ఎక్కువ వృద్ధా చేశాడని, అలా చేయవద్దని చెప్పినందుకు అతడితోపాటు అతడి స్నేహితులు తనతో ఘర్షణకు దిగారని కమల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా అతడి స్నేహితులకు ఫోన్ చేస్తే.. వారు కూడా వచ్చి తనతో వాదనకు దిగారని ఆ ఫిర్యాదులో అతడు పేర్కొన్నాడు. దీంతో అతని ఫిర్యాదు మేరకు సన్నీపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : momo vendor  chutney  man beaten  

Other Articles