Venkiah naidu | Modi | sleep

Venkiah naidu jokes pm modi

Venkiah naidu, Modi, sleep

Venkiah naidu jokes pm modi. Venkiah naidu said that modi will not sleep and also he is not allowing him to sleep.

మోదీ వల్ల తెగ బాధపడుతున్నానంటూ వెంకయ్య జోక్

Posted: 05/16/2015 10:12 AM IST
Venkiah naidu jokes pm modi

ప్రధాని నరేంద్ర మోదీ మాటల గారడి గురించి అందరికి తెలుసు. అసలు ఆయన మాటలే ఓ రకంగా ప్రధానమంత్రిని కూడా చేశాయి. అయితే ప్రస్తుతం కేంద్రంలొ మోదీకి ధీటుగా ఎవరైనా మాట్లాడగలరు అంటే  ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే అన్న సమాధానం వస్తుంది. అవును పార్లమెంట్ లో ప్రతిపక్షాల మాటలకు ధీటుగా నోటితో తూటాలు పేల్చేస్తారు వెంకయ్య నాయుడు. మీడియా వాళ్లకు కూడా విసుర్లు వేస్తూ .. కౌంటర్ ఇచ్చే వంకయ్య నాయుడు తాజాగా ఓ జోక్ వేశాడు. అయినా జోక్ వేస్తే నవ్వుకోండి అంతే కానీ చర్చించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా.. మరి వెంకయ్య నాయుడు గారు జోకేసింది ఎవరి మీద అన్న విషయం తెలిస్తే మీరు కూడా అవునా అనుకోకమానరు. అవును భారత ప్రధాని నరేంద్ర మోదీ మీదనే జోకేశారు వెంకయ్య నాయుడు. ఇంతకీ వెంకయ్య నాయుడు ఏం జోకేశారో తెలుసా..?

ప్రతిపక్షపార్టీలు ప్రధాని నరేంద్ర మోదీ గురించి ప్రతీసారి విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. ఇంతకీ ప్రతిపక్షాలు ఏం విమర్శలు చేస్తున్నాయంటే.. ప్రధాని మోదీ ఆయనా తినరు.. మమ్మల్ని తిననివ్వరు అని అంటుంటారట. అయితే వెంకయ్య నాయుడు విషయంలో మాత్రం సీన్ వేరేలా ఉందట. ఏంటంటే ఆయన నిద్రపోరు.. మమ్మల్ని నిద్రపోనివ్వరు అంటూ పాపం వెంకయ్య నాయుడు మోదీ వల్ల తన నిద్ర చెడిపోతోందంటూ వివరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkiah naidu  Modi  sleep  

Other Articles