Telangana | Naxals | Police | Intelligence

Telangana state may become as capital to the naxals

Telangana, Naxals, Police, Intelligence, Warning

Telangana state may become as capital to the naxals. Police intelligence warned for naxals from last two years. Naxals become more strong in telangana and ap boarder.

తెలంగాణలో మళ్లీ నక్సల్స్ కదలికలు..!

Posted: 05/16/2015 08:29 AM IST
Telangana state may become as capital to the naxals

రాష్ట్ర విభజన సమయంలో నిఘా వర్గాలు హెచ్చరించినట్లే జరుగుతోందా..? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యడం వల్ల నక్సల్స్ బలపడతారు అన్న వాదనలు నిజమవుతున్నాయా..? మరోసారి తెలంగాణలో నక్సల్స్ చురుకుగా మారారా..? గతంలో ఎన్నడూ లేనంతగా మావోలు పనితీరును మెరుగుపర్చుకున్నారా..? ఇలా చాలా ప్రశ్నలు కానీ దాదాపుగా అన్నింటికి సరాసరిగా అవుననే సమాధానం. గత కొంత కాలంగా తెలంగాణ వ్యాప్తంగా నక్సల్స్ ప్రాబల్యం పెరిగిన మాట వాస్తవమే. అయితే కారణాలు వేరేలా ఉన్న కొత్తగా ఏర్సడిన రాష్ట్రానికి నక్సల్స్ సమస్య ఖచ్చితంగా అడ్డంకుగా మారకతప్పదు. ఏపి, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడిగా ఉన్నప్పుడు గ్రేహౌండ్స్ పోలీసులు దాదాపుగా నక్సల్స్ ప్రాబల్యాన్ని తగ్గించడగలిగారు. కానీ ప్రస్తుతం పరిస్థితి వేరేలా ఉంది. రెండు రాష్ట్రాలు ప్రస్తుతం నక్సల్స్ పై దృష్టి పెట్టలేని పరిస్థితి. ఇదే ఇప్పుడు వారికి కలిసి వచ్చే అంశంగా మారింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా వారికి బాగా కలిసి వస్తోంది.

గత కొద్దిరోజులుగా ఛత్తీస్‌ఘడ్ నుంచి తెలంగాణలోకి మావోయిస్టుల చొరబాట్లు పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. వారిని అడ్డుకునేందుకు అదనపు బలగాలు పంపి గాలింపులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో వీరి కదలికలు ఎక్కవగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ పరిమితంగా అయినా చొరబాట్లు పెరుగుతున్నట్లు కూడా గుర్తించారు. పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్దగా మావోయిస్టు కదలికలు లేవు. ఛత్తీస్‌ఘడ్‌లో మాటువేసి ఉన్న మావోయిస్టులు అదను చూసి తెలంగాణలోకి చొరబడి మళ్లీ సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లిపోతున్నారు. వేసవి కాలంలో అడవులలో పచ్చదనం తగ్గిపోవడంతో మావోయిస్టుల చొరబాట్లు కష్టమవుతాయి. పోలీసుల గాలింపులకు సులభంగా దొరికిపోయే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో చాలావరకూ అజ్ఞాతానికి పరిమితం అవుతారు. ఈసారి మాత్రం వేసవిలోనూ మావోల కదలికలు కనిపిస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్ నుంచి ఖమ్మం, నిజామాబాద్‌లలోకి, మహారాష్ట్ర గడ్చిరోలి నుంచి ఆదిలాబాద్ జిల్లాల్లోకి చొరబాట్లు పెరిగాయని అనుమానిస్తున్న పోలీసులు ఆయా ప్రాంతాలకు అదనపు బలగాలు పంపారు. రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. వీటిని ఆ రాష్ట్రానికి అప్పగించే సమయంలో కొంతకాలం పాటు రెండు రాష్ట్రాల పోలీసులు పట్టించుకోలేదు. పోలీసుల ఒత్తిడి లేకపోవడంతో దీన్ని ఆసరాగా తీసుకొని ఈ మండలాల్లోనూ మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయి. వీరి కదలికలు పెరగడం వెనుక కారణం ఏమై ఉంటుందనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. ముందు జాగ్రత్తగా తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు గాలింపులు పెంచారు. మరి పోలీసులు గనక నక్సల్స్ ను కట్టడి చెయ్యలేకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది అని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Naxals  Police  Intelligence  Warning  

Other Articles