satyam ramalingaraju and scam accused members released from charlapalli jail

Satyam ramalingaraju released from charlapalli jail

satyam ramalingaraju, satyam scam news, satyam scam members, satyam controversy, charlapalli jail news, cbi high court, cbi news, indian scams

satyam ramalingaraju released from charlapalli jail : After 2 days of court granted bail.. satyam ramalingaraju and scam accused members released from charlapalli jail

జైలు నుంచి విడుదలైన ‘సత్యం’ కుంభకోణం ‘రాజు’లు

Posted: 05/14/2015 07:51 AM IST
Satyam ramalingaraju released from charlapalli jail

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో శిక్ష ఖరారై శిక్ష అనుభవిస్తున్న సత్యం రామలింగరాజు బుధవారం బెయిల్‌పై చర్లపల్లి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనతోపాటు ఈ కేసులో నిందితులుగా వున్న ఆయన సోదరుడు రామరాజు, సీఎఫ్‌వో వడ్లమాని శ్రీనివాస్, ఎస్.గోపాల్‌కృష్ణన్, తాళ్లూరి శ్రీనివాస్, సూర్యనారాయణరాజు, సంస్థ వైస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, వీఎస్ ప్రభాకర్‌గుప్త, ఫైనాన్స్ విభాగం ఉద్యోగులు వెంకటపతిరాజు, సీహెచ్ శ్రీశైలం కూడా జైలునుంచి విడుదలయ్యారు.

రెండురోజుల క్రితమే బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది కానీ.. బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో విడుదల ఆలస్యంగా జరిగిందని తెలుస్తోంది బుధవారం సాయంత్రం 5 గంటల తర్వాత అధికారులకు ఉత్తర్వులు అందగా.. వెంటనే పని పూర్తిచేసి 6:30 గంటల సమయంలో వారందరినీ జైలు నుంచి విడుదల చేశారు. బెయిల్ ఉత్తర్వులు రావడంలో జాప్యం వల్లే విడుదల ఆలస్యమైందని అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలావుండగా.. జైలు నుంచి విడుదలవుతున్న సందర్భంలో రామలింగరాజు మీడియాకంట పడకుండా బయటకు వెళ్లేలా జైలు అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ రోజుల్లో జైలు లోపల గేటు వరకు మీడియాను అధికారులు అనుమతించేవారు కానీ.. మాత్రం జైలు వెలుపల గేటు వద్దే మీడియాను ఆపేశారు. అటు రామలింగరాజు విడుదల నేపథ్యంలో ఆయన పీఏ జైలు వద్ద బాగానే హడావుడి చేశాడని సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satyam ramalingaraju  charlapalli jail  

Other Articles