Jayalalitha | Modi | BJP | AIDMK | Tamilnadu

New political strategy in tamilnadu narendra modi greet jayalalitha after karnataka high court annouced the final judgement and relief to jayalalitha

Court, Jayalalitha, Modi, BJP, AIDMK, Tamilnadu

New political strategy in tamilnadu. Narendra modi greet jayalalitha after karnataka high court annouced the final judgement and relief to jayalalitha.

జయలలిత, మోదీ జత కడతారా..?!

Posted: 05/12/2015 01:54 PM IST
New political strategy in tamilnadu narendra modi greet jayalalitha after karnataka high court annouced the final judgement and relief to jayalalitha

తమిళనాడులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా.. జయలలితకు అనుకూలంగా కోర్టు తీర్పు వెల్లడించగానే ప్రధాని నరేంద్ర మోదీ జయలలితకు గ్రీటింగ్స్ చెప్పడం కొత్త పొత్తుకు తెర తీస్తోందా అన్న అనుమానాలే కలిగిస్తోంది. తమిళనాడులో శరవేగంగా మారుతున్న రాజకీయ పరి ణామాల నేపధ్యంలో కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సతమతమైన జయలలితకు కర్ణాటక హైకోర్టు నుంచి ఊరట లభించడంతో ఆ రాష్ట్ర రాజకీయాలు చకచకా మారుతున్నాయి. తమిళనాడులో తమ ఉనికిని చాటుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న బీజేపీకి...ఈ సందర్భం కలిసొచ్చిన అవకాశంగా పరిశీలకులు భావిస్తున్నారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో జయలలిత పోటీకి అనర్హురాలైతే...ఏఐఏడీఎంకేకి సమర్ధవంతమైన సారధ్యం కరువవుతుందేమోననే భయం, బెంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. కర్ణాటక హైకోర్టు తీర్పుతో...జయలలిత మళ్లిd చురుగ్గా రాజకీయాల్లో పాల్గొనే అవకాశం అందిపుచ్చుకోవడంతో పార్టీ ఆనందోత్సాహాల్తో తలమునకలవుతోంది. సరిగ్గా ఇప్పు డే... కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమిళనా డులో ఉనికిని చాటుకునేందుకు ఏఐఏడీఎంకేతో సాన్నిహి త్యాన్ని కోరుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అదే సమ యంలో రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖపాత్ర నిర్వర్తిస్తున్న ఏఐఏడీఎంకేకి కూడా కేంద్రంలో పట్టు సాధించుకునేందుకు గాను బీజేపీతో మైత్రీ బంధం అత్యవసరం. అందువల్ల మారుతున్న రాజకీయపరిస్థితుల్లో బీజేపీ, ఏఐఏడీఏంకేలు చెట్టాపట్టాలేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో.. బయటికి వచ్చిన తర్వాత జయలలిత ఏదైనా ప్రకటన చేస్తుందో లేదో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Court  Jayalalitha  Modi  BJP  AIDMK  Tamilnadu  

Other Articles