Caol gate | Dasari Narayan rao| Alligations

Dasari narayan rao said that some body trying to save big presonalities

Caol gate, Dasari Narayan rao, Coal scam, Birth day, Alligations

Dasari narayan rao said that some body trying to save big presonalities. he said that he will escape from the all alligations soon.

పాపం బలైపోయావా.. దాసరి..?

Posted: 05/11/2015 09:04 PM IST
Dasari narayan rao said that some body trying to save big presonalities

అవును.. ఆయనెంతో మంది సినిమా వాళ్లకు కొత్త లైఫ్ ఇచ్చారు కానీ ఇప్పుడు మాత్రం తాను బలైపోయానని అంటున్నారు. దాసరి నారాయణరావు పుట్టిన రోజు సందర్భంగా జరిగిన వేడుకలో చేసిన వ్యాఖ్యలు తన పేరు బొగ్గు కుంభకోణంలో ఉండటాన్ని పరోక్షంగా ఖండించారు. అంతేనా కావాలనే తనను ఇరికించారన్నట్లు మాట్లాడారు. బొగ్గు కుంభకోణంలో తీవ్ర  ఆరోపణలు ఎదుర్కుంటున్న దాసరి నారాయణ రావు తన నిజాయితీ గురించి చెప్పుకొచ్చారు. తాను ని.జాయితీపరుడినని అంటూ.. ఎవరినో కాపాడుకునేందుకు తనను బలి చేశారని దాసరి వివరించారు. తనపై పడ్డ మచ్చను తొలగించుకుంటానని కూడా దాసరి వివరించారు. అయితే ఇప్పటికే సిబిఐ ఎక్వైరీ ఎదుర్కొని.. కోర్టుల చుట్టు చక్కర్లు కొడుతున్నారు పాపం దాసరి నారాయణ రావు.  కుంభకోణానికి సంబంధించి అప్పట్లో బొగ్గు శాఖ మాజీ సహాయ మంత్రి దాసరి నారాయణరావుపై సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.  కోల్గేట్ స్కామ్లో ఈ నెల 22న దాసరి కోర్టుకు హాజరు కానున్నారు. బొగ్గు గనుల కేటాయింపులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

బొగ్గు కుంభకోణంలో టాలీవుడ్ దర్శకుడు దాసరి నారాయణ రావును  సీబీఐ విచారించింది.  దాసరి నారాయణ రావు యూపీఏ-1 ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ యూపీఏ-1 ప్రభుత్వంలోనే బొగ్గు స్కామ్ జరిగినట్టు సీవీసీ నివేదిక బట్టబయలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశం మేరకు దర్యాప్తు చేసిన సీబీఐ కూడా భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు తేల్చింది. 1.68 లక్షల కోట్ల బొగ్గు కుంభకోణంలో దాసరి పాత్ర ఏంటి? అక్రమంగా కేటాయించిన గనుల్లో ఈయన పాత్ర ఏంటి తదితర అంశాలపై సీబీఐ విచారించింది. మరి దాసరి నారాయణ రావు మాత్రం తనపై పడిన మచ్చను తొలగించుకుంటానని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Caol gate  Dasari Narayan rao  Coal scam  Birth day  Alligations  

Other Articles