తెలుగు రాష్ట్రాల్లో సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికుల ఫిట్ మెంట్ విషయంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమ్మెపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు నియమించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, మహేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్‌తో పాటుగా ఆర్టీసీ అధికారులు కూడా హాజరయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు, వారి సమస్యలపై చర్చించారు. అదేవిధంగా కేబినెట్ సబ్ కమిటీలో మరో ఇద్దరు మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను సీఎం కేసీఆర్ నియమించారు.
ఆర్టీసీ కార్మికులకు సుమారు 35 శాతం ఫిట్‌మెంట్‌ను ఇచ్చే అంశంపై సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చించారు. ఫిట్‌మెంట్ పెంచాల్సి వస్తే ప్రభుత్వంపై ఆధార పడకుండా అదనపులు నిధులు సమకూర్చుకోవాల్సిన అంశాలపై ఆర్టీసీ దృష్టిసారించాలని కేసీఆర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్టీసీ చార్జీల పెంపు, ఇతర ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలన్నారు. ప్రభుత్వ పరిమితులు, కార్మికుల సంక్షేమానికి అనుగుణంగా సమ్మెపై సబ్‌కమిటీ నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. అయితే తమ ఫిట్ మెంట్ విషయంలో తెలంగాణ సర్కార్ 35 శాతం ఇవ్వడానికి ముందుకు రావడంతో ఆర్టీసీ యూనియన్లు ఆలోచనలో పడ్డట్లు సమాచారం. అయితే పైకి మాత్రం 35శాతం ఫిట్ మెంట్ పై అంగీకరించేది లేదని చెబుతున్నా.. లోలోపల మాత్రం బెటర్ అనే ఆలోచన ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి నుండి తాము అనుకున్నంత కాకపోయిన కనీసం దాదాపు అనుకున్న దానికి దగ్గర్లోనే ఫిట్ మెంట్ ఉంది కదా అని ఆర్టీసీ యూనియన్లు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే సమ్మె మాత్రం కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికుల యూనియన్లు ప్రకటించాయి.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more