Kiran kumar reddy | Cm | ap | book

Ap former cm kiran kumar willl release a 400pages book soon

Kiran kumar reddy, Cm, ap, book, congress, tdp, bifercation

AP former cm kiran kumar willl release a 400pages book soon. In this book he explaing the situations when the bifercation struggle in the peak stage. Congress and tdp leaders are fearing about the kiran kumar reddys book.

కిరణ్ కుమార్ రెడ్డి పుస్తకం.. పుట్టిస్తోంది కలవరం

Posted: 05/11/2015 06:34 PM IST
Ap former cm kiran kumar willl release a 400pages book soon

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న వారికి తెలిసిందే. అప్పుడెప్పుడో ఉమ్మడి ఏపి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసి, తర్వాత ఓ పార్టీని స్థాపించిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం మరోసారి వార్తల్లోకెక్కారు. చాలా కాలం అసలు ఉన్నాడో లేదో అన్నంతగా మాయమైన కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ మీడియా దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేక, తను స్థాపించిన పార్టీ అసలు ఉందో లేదో తెలీని స్థితిలో ఉన్న ఆయన ఇప్పుడు రచయితగా మారబోతున్నారు. 400 పేజీలతో కూడిన పుస్తకాన్ని సిద్దం చేస్తున్నారు, ఆ బుక్ లో విభజన ప్రశ్నలకు సమాధానాలను వివరించనున్నారట.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజనకు ముందుకు ముఖ్యమంత్రిగా చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలనాలకు సిద్ధం కాబోతున్నారా..? కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ టార్గెట్ గా విరుచుకుపడనున్నారా..? రాష్ట్ర విభజనకు ఎవరెవరు సహకరించారు? కేంద్రంలో సోనియా, ఆమె కుమారుడు రాహుల్, రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు, పలువురు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా సహకరించారు? కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు ప్రత్యేక తెలంగాణ పై ఎటువంటి నివేదికలు సమర్పించారు? ఇలాంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేక, తను స్థాపించిన పార్టీ అసలు ఉందో లేదో తెలీని స్థితిలో ఉన్న ఆయన ఇప్పుడు రచయితగా మారబోతున్నారు. 400 పేజీ లతో కూడిన పుస్తకాన్ని సిద్దం చేస్తున్నారు, ఆ బుక్ లో విభజన ప్రశ్నలకు సమాధానాలను వివరించనున్నారట. త్వరలోనే పుస్తకాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తానని వివరించారు. కాంగ్రెస్ వీడి, జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టడానికి గల కారణాలను కూడా సదరు పుస్తకంలో వివరించానన్నారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి పుస్తకం ఎన్ని వివాదాలకు తెర తీస్తుందో.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత వేడి పుట్టిస్తుందో.. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఏమేరకు నష్టం కలిగిస్తుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kiran kumar reddy  Cm  ap  book  congress  tdp  bifercation  

Other Articles