Street fighting: Nabeel pals threatened his dad for going to cops

Murder in street fight over love affair

Street fighting turns ugly in Hyderabad, kills teen, Mirchowk, Hyderabad, street fighting, boxing bout, old city, Hyderabad, teen dies after continous blows on head and face, Crime, wwf, crime in telangana, crime in hyderabad, sabil, old city boxing video goes viral, nabil father yousuf, nabil parents alleges their son nabil its a cold blooded murder, Dcp satya narayana

Nabeel pals threatened his dad Yousuf for going to cops, and now doubts araise in Street fighting: murder

ప్రేమ వ్యవహారమే అతడిని అంతమొందించిందా..?

Posted: 05/11/2015 06:21 PM IST
Murder in street fight over love affair

హైదరాబాదులో జరిగిన స్ట్రీట్ ఫైట్ హత్యంద టనలో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రేమ వ్యవహారమే నబిల్ హత్యకు దారి తీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కామన్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో జరిగిన గొడవలే చివరకు హత్యకు దారి తీసిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అబూ బకర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రేయసి విషయంలో జరిగిన గొడవలను మనసులో పెట్టుకుని నబిల్‌ను చంపేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుస్తీ పోటీలో నబిల్ గెలిచిన తర్వాత పిడిగుద్దులు గుద్దడం, అంతకు ముందు అబూబకర్‌తో అబేజ్ అహ్మద్‌ చెవిలో గుసగుసలు పెట్టడం ఆ అనుమానాలకు దారి తీస్తోందని అంటున్నారు.

ప్రేమ వ్యవహారంలో స్నేహితుల మద్య వచ్చిన మనస్పర్థలే హత్యకు కారణమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో గతంలోనూ వారి మధ్య  పలుమార్లు గొడవ జరిగినట్లు చెబుతున్నారు. ప్రేయసి కోణంపై దర్యాప్తు చేస్తూ పోలీసులు వారి ఫోన్ నెంబర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నబిల్ మృతదేహానికి సోమవారం పోస్టు మార్టం నిర్వహించనున్నారు. బెట్టింగ్‌లో భాగంగానే స్ట్రీట్‌ ఫైట్ జరిగినట్లు తెలిపిన సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ.. ప్రేమ వ్యవహారమే ఇ:దుకు కారణమని తెలియడంతో హత్యానేరం కింద కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. నబిల్‌ను కొట్టేందుకు ముందుగానే కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో మొత్తం 8మంది ఉన్నట్టు తేలింది. ఓవైస్ పటేల్ సహా ఉమార్‌బేగ్ (20), సుల్తాన్‌మీర్జా (21), ఇర్ఫాన్ పటాన్ (20), షాబాస్ (20), అబూబాకార్ (19), ఓబైద్ (19)తోపాటు మరో మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదిలా వుండగా, నబిల్ తండ్రి మహ్మమద్ దస్తగిర్ ను అతని స్నేహితులు హెచ్చరించినట్లుగా సమాచారం. కుమారుడి హత్యోదంతం ఘటన వెలుగు చూడటంతో.. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆయన పోలీసులను ఆశ్రయించడంతో యూసుఫ్ ను నబిల్ స్నేహితులు బెరించారని తెలుస్తోంది. తన కోడుకుది ముందు ప్రమాద ఘటనగా స్నేహితులు చెప్పారని, అనంతరం వీడియో భయటకు వచ్చిన తరువాత ఈ ఘటనను విచారించాల్సిందిగా వారు ఈ నెల న పోలీసులను ఆశ్రయించారని తెలుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  telangana  street fight  murder  love affair  

Other Articles