Hit and Run Case: Actor Salman Khan gets relief, Bombay High Court suspends sentence

Friday release salman to stay out of jail for now in hit and run case

hit-and-run case, salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news, chiranjeevi, mega star, tollywood mega star chiranjeevi,

In a relief to actor Salman Khan, the Bombay High Court on Wednesday granted bail to the actor and suspended his five-years sentence in 2002-hit-and-run case.

బోంబే హైకోర్టులో సల్మాన్ కు ఊరట.. కిందికోర్టు తీర్పు సస్సెండ్

Posted: 05/08/2015 11:35 AM IST
Friday release salman to stay out of jail for now in hit and run case

బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఆయన బెయిల్ పిటీషన్ పై బోంబే హైకోర్టులో ఊరట లభించింది. ముంబాయి సెషన్స్ కోర్టు వెలువరించిన తీర్పును బాంబే హైకోర్టు నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. 2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించి,, సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేస్తూ వెలువరించిన తీర్పును బోంబే హైకోర్టు సస్పెండ్ చేసింది.

కండల వీరుడిగా ఇమేజ్ సంపాదించే యత్నంలో సల్మాన్ ఖాన్.. తన అభిమానుల కోసం తీవ్రంగా శ్రమించారని, ఈ క్రమంలో ఆయన నరాల సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయస్థానం.. ముంబాయి సెష్సన్స్ కోర్టు వెలువరించిన తీర్పును సస్పెండ్ చేసింది. దీంతో  సల్మాన్ ఖాన్ పోలీసులు కస్టడీకి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది.

సల్మాన్ ఖాన్ కు బెయిల్ ఇచ్చిన పక్షంలో దేశం నుంచి పారిపోయే వ్యక్తి కాదని బోంబే న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ తరుణంలో సల్మాన్ ఖాన్ కు మంజూరి చేసిన బెయిల్ రెగ్యూలర్ బెయిల్ గా మారింది. సల్మాన్ ఖాన్ ను మరోమారు ముంబాయి సెషన్స్ కోర్టుకు వెళ్లి తాజా బాండ్ ను దాఖలు చేయాలని కోరింది. మహారాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.. బోంబే హైకోర్టులో సల్మాన్ ఖాన్ బెయిట్ పిటీషన్ పై జరిగిన వాదనలలో ఆయన తరపు న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

జి.మనోహర్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  chiranjeevi  Hit and run case  Mumbai  bail  

Other Articles