Manohar Parrikar | KCR | secretariate

Centre okays polo ground for construction of telangana secretariat

Manohar Parrikar, CM K Chandrasekhar Rao, Telangana, South, secretariate,

Union defence minister Manohar Parrikar on Thursday responded positively to the Telangana State government’s plea to part with the 60-acre Bison Polo Ground in Secunderabad for construction of the new state secretariat in lieu of alternative land, and other defence-related issues.

బైసన్ గ్రౌండ్ లో తెలంగాణ సెక్రటేరియట్

Posted: 05/08/2015 11:26 AM IST
Centre okays polo ground for construction of telangana secretariat

తెలంగాణ సచివాలయంపై గత కొంత కాలంగా రగడ నడుస్తోంది. ఉన్న సెకరటేరియట్ స్థానంలో కొత్తది కట్టాలని ముందు అనుకున్నా.. తర్వాత మాత్రం ఎర్రగడ్డలోని ఛాతి ఆస్పత్రి వద్దగా కొత్తగా నిర్మించాలని తెలంగాణ సర్కార్ ఆలోచించింది. అయితే అక్కడ నిర్మాణానానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని అక్కడి కాకుండా వేరే చోట కట్టాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం.. తర్వాత సచివాలయాన్ని సికింద్రాబాద్ లోని బైసన్ గ్రౌండ్ లో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్దం చేసింది. అయితే అది రక్షణశాఖ ఆధీనంలో ఉన్న స్థలం కాబట్టి రక్షణ మంత్రిత్వ శాఖ పర్మిషన్ కావాలి. అందుకే ఢిల్లీ టూర్ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయానికి రూట్ క్లీయర్ చేసుకొని వచ్చారు.

తెలంగాణ సచివాలయం నిర్మించేందుకు వీలుగా సికింద్రాబాద్‌లోని 60 ఎకరాల బైసన్ గ్రౌండ్స్ స్థలాన్ని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కోరారు. దాదాపు తెలంగాణ ప్రతిపాదనకు ఒప్సుకున్న రక్షణ మంత్రి.. 60 ఎకరాల స్థలాన్ని తమకు వేరే చోట కల్పించాలని కేసీఆర్ తో అన్నారు. దాంతో కొత్తగా బైసన్ గ్రౌండ్ లోని 60 ఎకరాల స్థలంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వానికి అన్ని రకాలుగా లైన్ క్లీయర్ అయింది. అయితే రక్షణ శాఖ నుండి ల్యాండ్ స్టేట్ గవర్నమెంట్ కు బదిలీ కావడానికి కాస్త టైం పడుతుంది. అయితే అంతలోపు తెలంగాణ ప్రభుత్వం కూడా రక్షణ శాఖకు 60 ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుంది. మొత్తానికి ఎక్కడెక్కడో అనుకున్న సెక్రటేరియట్ ఇప్పుడిక సికింద్రాబాద్ బైసన్ గ్రౌండ్ లో ఖరారైంది. మరి తెలంగాణ ప్రభుత్వం టకటకా అనుమతులు పొంది.. నిర్మాణాన్ని ప్రారంభించడమే తరువాయి..

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manohar Parrikar  CM K Chandrasekhar Rao  Telangana  South  secretariate  

Other Articles