Hit and run case: Will luck smile on Salman Khan today?

Hit and run case will luck smile on salman khan today says lawyer majeed memon

chiranjeevi, mega star, tollywood mega star chiranjeevi, hit-and-run case, salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news

Legal experts feel Khan may get regular bail pending his appeal on the verdict as he has been on bail throughout the trial.

సల్మాన్.. సాల్వే బిజీ.. దేశాయ్ వస్తున్నాడు..ఓకేనా..!

Posted: 05/08/2015 11:33 AM IST
Hit and run case will luck smile on salman khan today says lawyer majeed memon

బాలీవుడ్ ప్రముఖ నటుడు, కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఆయన బెయిల్ పిటీషన్ పై ఇవాళ ముంబాయి హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా.. రెండు రోజుల క్రితం ఆయనను ముంబాయి సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. 2002లో ముంబైలోని సబర్బన్ బాంద్రా ప్రాంతంలో పేవ్‌మెంట్‌పై పడుకున్న వారిపైకి తన వాహనంతో దూసుకెళ్లి ఒకరి మృతికి కారణమైన కేసులో సల్మాన్‌ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సల్మాన్‌పై నమోదు చేసిన అభియోగాలన్నీ రుజువయ్యాయని స్పష్టం చేసింది.

దీంతో హుటాహుటిన బాంబే హైకోర్టుకు వెళ్లి ఇంటరిమ్ బెయిల్ తీసుకుని తన సత్తాను చాటిన న్యాయవాది హరీష్ సాల్వే ఇవాళ ఆయన తరపున కోర్టుకు హాజరకావడం లేదు. సాల్వే మరో కేసును దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదించాల్సి రావడంతో.. ఆయన ఇవాళ ముంబై హైకోర్టుకు హజారుకావడం లేదు. సల్మాన్ తరపున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ వాదనలు వినిపించనున్నారు. కాగా అయిదేళ్లకు పైగా జైలు శిక్ష పడినవాళ్ల అప్పీల్ పిటిషన్పై నిర్ణయానికి కొంత సమయం పడుతుందని సీనియర్ క్రిమినల్ న్యాయవాది మజీద్ మెమన్ పేర్కొన్నారు. ఈలోగా దోషిని కస్టడీలో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. సల్మాన్ పారిపోయే మనిషి కాదు అని మజీద్ మెమన్ వ్యాఖ్యానించారు.

బెయిల్ కోసం బోంబే హైకోర్టు కొంత సమయం తీసుకుంటుందని ఆయన తరపు న్యాయవాదులే తేల్చిచెబుతున్న తరుణంలో.. అక్కడి బెయిల్ విఫలమైతే.. వెనువెంటనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టాలని సల్మాన్ ఖాన్ తరపు న్యాయవాది హరీష్ సాల్వే.. అక్కడే వున్నారా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ కు ఇవాళ బెయిల్ నిరాకరించిన పక్షంలో సోమవారం వరకు ఆయన ఆథర్ రోడ్డ్ జైలులోనే గడపాల్సి వుంటుంది.  

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Hit and run case  Bombay high court  bail  

Other Articles