Lok Sabha passes Juvenile Justice Bill

Lok sabha passes amendments to juvenile justice act

juvenile justice bill, care and protection of children, lok sabha, maneka gandhi, Juvenile justice act, juvenile age, amendment bill, Budget Session, Congress, Land Acquisition Bill, Land Bill, Mallikarjun Kharge, Narendra Modi, parliament, Venkaiah Naidu

The Juvenile Justice Bill will allow children in the 16-18 age group to be tried as adults if they commit heinous crimes.

నేరం చేశారా..? 16 దాటిందా..? అయితే పెద్దోళ్ల శిక్షలే..!

Posted: 05/07/2015 10:18 PM IST
Lok sabha passes amendments to juvenile justice act

బాల నేరస్థులకు వయస్సును తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన చట్టాన్ని లోక్సభ ఆమోదించింది. 16-18 ఏళ్ల మధ్య వయసున్న వాళ్లు దారుణమైన నేరాలకు పాల్పడినా కూడా వాళ్లను బాల నేరస్థులుగానే చూడాల్సి రావడం, దానివల్ల వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోవడం లాంటి ఘటనల నేపథ్యంలో కేంద్రం బాల నేరస్థుల చట్టం సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టగా.. సభ దాన్ని ఆమోదించింది. ఇక దీన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలి. అలా అయితే ఇక మీదట చట్టాన్ని సవరించి, 16 ఏళ్లు దాటినవాళ్లంతా పెద్దవాళ్లేనని భావిస్తారు. ఇందులో సాధారణ నేరాలు, తీవ్రమైన నేరాలు, హేయమైన నేరాలు అనే మూడు విభాగాలుగా నేరాలను వర్గీకరించారు. ప్రతి విభాగానికి వేర్వేరుగా విధానాలను అందులో నిర్వచించారు.

నిర్భయ ఘటనలో అందరికంటే ఘోరంగా ప్రవర్తించినది ఒక మైనర్ కావడంతో అప్పటి నుంచి బాల నేరస్థుల వయసు మీద చర్చలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 2000 నాటి బాల నేరస్థుల చట్టానికి దాదాపు 40 సవరణలు రాగా, అన్నింటినీ లోక్సభ ఆమోదించింది. 2013 సంవత్సరంలో మొత్తం 28 వేల కేసుల్లో బాల నేరస్థులు ఉండగా, వాటిలో 3887 అత్యంత హేయమైనవని జాతీయ నేర రికార్డుల బ్యూరో కూడా వెల్లడించిందని ఈ బిల్లు మీద జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Juvenile justice act  juvenile age  amendment bill  

Other Articles