Rahul debuts on Twitter, 'Office of RG' tweets about schedule

Rahul gandhi makes twitter debut

Rahul Gandhi, Twitter account, Congress leader,parties and movements, political parties, rahul gandhi on twitter, rahul gandhi into social media, Rahul Gandhi, Twitter, Office of RG

A day after its debut on Twitter, 'Office of RG' has acknowledged it is the official account of Congress vice-president Rahul Gandhi.

ట్విట్టర్ ఖాతా తెరిచిన కాంగ్రెస్ యువనేత

Posted: 05/07/2015 10:14 PM IST
Rahul gandhi makes twitter debut

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. స్వపక్షానికి చెందిన నాయకులతో పాటు. విపక్షానికి చెందిన నాయకులు ఇప్పటికే సామాజిక మాద్యమం ద్వారా తమ అభిమానులు, కార్యకర్తలతో ప్రతినిత్యం తాజా సమాచారాన్ని అందించి.. వారితో పంచుకుంటున్న నేపథ్యంలో కాంగ్రెస్ యువనేత ఇన్నాళ్లకు సామాజిక మీడియాలో అడుగుపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి తోటి నాయకులంతా ట్విట్టర్ను ఏలేస్తున్న ఈ కాలంలో.. ఇన్నాళ్ల తర్వాత ఆయన ట్విట్టర్ ఖాతా తెరిచారు.

@OfficeOfRG అనే ఐడీతో ట్విట్టర్ హ్యాండిల్ ప్రారంభించారు. ఆయన కేవలం మూడంటే మూడే అకౌంట్లను ఫాలో అవుతున్నారు. అవి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ. అయితే.. ఇందులో వస్తున్న ట్వీట్లను చూస్తుంటే మాత్రం ఇది రాహుల్ గాంధీ స్వయంగా నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలా కాకుండా, ఆయన తరఫున వేరే ఎవరో నిర్వహిస్తున్నట్లే కనిపిస్తోంది. మే 12వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారంటూ ఓ ప్రకటనను మొదటి ట్వీట్గా ఇచ్చారు. రాహుల్ అధికారిక కార్యక్రమాలు, రాబోయే కార్యక్రమాల గురించి ఇందులో ఉంటుందని కూడా చెప్పారు. కాగా, గురువారం రాత్రి సమయానికి సుమారు 43 వేల మంది రాహుల్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Twitter  Office of RG  

Other Articles