MLC elections on 1st June

Poll notification for 10 mlc seats in ts ap

Poll Notification for 4 MLC Seats, Elections to Fill Four Seats of MLC in AP, Election Commission of India, MLC Elections on March 16, Election Commission of India, EC notifies schedule for MLC Elections in Telangana, four

The Election Commission of India (ECI) on Thursday issued notification for the elections to fill ten seats of Members of Legislative Council, six in Telangana and four in AP.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరా మ్రోగిందహో..!

Posted: 05/07/2015 10:11 PM IST
Poll notification for 10 mlc seats in ts ap

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు నగరా మోగింది. దీనికి సంబంధించి గురువారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి 3 ఎమ్మెల్సీ స్థానాలు తక్కువ వచ్చాయని, కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారం ఆ మూడు స్థానాలను భర్తీ చేయనున్నారు. జనవరిలో పాలడుగు వెంకట్రావు మరణంతో ఆ ఎమ్మెల్సీ స్థానం కూడా ఖళీ అయింది. దీంతో మొత్తం ఏపీలో 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.

ఎన్నికలకు సంబంధించి ఈ నెల 14న నోటిఫికేషన్‌ జారీ కానుంది. 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 23 నుంచి 25 వరకు ఉపసంహరణ గడువు, జూన్‌ 1న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్‌ జరుగుతుందని షెడ్యూల్‌ ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC elections  Election Commission  Telangana  Andhra Pradesh  

Other Articles