Police | Shoes | missing

Anshal guta complante to police for his missing shoes

Police, Sheos, missing, delhi, kanpur,

anshal guta complante to police for his missing shoes. A kanpur preson complainte to police for his shoes.

హయ్యా.. బూట్లు పోయాయని పోలీస్ కేసా??

Posted: 05/07/2015 03:59 PM IST
Anshal guta complante to police for his missing shoes

మన వస్తువులు ఏవైనా కనిపించకుండాపోతే కాసేపు బాధపడి.. తర్వాత తేరుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇస్తాం. బాబూ పోలీసులు మా ఫలానా వస్తువు పోయింది లేదంటే దొగతనం చేశారని కొన్ని గుర్తులు కూడా చెప్పి వెతికి పెట్టండి అని అంటుంటాం. అయితే ఇలా ఇచ్చే కంప్లైంట్స్ పై చాలా సినిమాల్లో జోకులు కూడా వచ్చాయి. మా ఆవిడ తప్పిపోయిందని, కుక్క పిల్ల పోయిందని, మా ఇల్లు కనిపించడం లేదని ఇలా రకరకాలుగా పోలీసులను ఆటపట్టించడం సినిమాల్లో చూసే ఉంటారు. కానీ ఇలాంటి సంఘటన నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుందో తెలుసా మేం చెప్పబోయే ఘటన కూడా అలాంటిదే..

ఇలాంటి కేసు గురించి ఎప్పుడూ వినివుండరు కనీసం ఎప్పుడూ ఊహించరు కూడా. కేసు గురించి తెలుస్తే ఆశ్చర్య పడకుండా ఉండరు. గుడిలోకి వెళ్లి బయటికి వచ్చే సరికి తన షూస్ (బూట్లు) మాయమయ్యాయని కేసు పెట్టాడు ఓ వ్యక్తి. ఈ విషయం విన్న పోలీసులు ముందుగా షాక్ తిన్నా ఆ తర్వాత తేరుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాన్పూర్ కి చెందిన అన్షల్ గుప్తా అనే వ్యక్తి ఢిల్లీలోని ప్రముఖ కాకాజీ గుడికి వచ్చాడు. లోపలి వెళ్ళే ముందు తన షూస్ ని విప్పి కౌంటర్ లో పెట్టి టోకెన్ తీసుకున్నాడు. దైవ దర్శనం అయిపోయినంకా బయటికి వచ్చి చూస్తే షూస్ కనిపించలేదు. దీంతో, ఆలయ అధికారులతో కొద్దిసేపు గొడవపడ్డాడు. అవి కొత్తగా కొన్నానని, బ్రాండెడ్ షూ అని ఆవేదన చెందాడు. అందుకోసం పోలీసులను ఆశ్రయించాడు. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం విశేషం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Sheos  missing  delhi  kanpur  

Other Articles