Revanth reddy | kcr | Classes

Ttdlp leader revanth reddy commented on special classes for kcr

TTDLP, Revanth reddy, kcr, Classes, nagarjunasagar

Ttdlp leader revanth reddy commented on special classes for kcr. Kcr and trs party leaders attending classes at nagarjuna sagar.

కేసీఆర్.. కావాలంటే నేను క్లాస్ తీసుకుంటా రండి

Posted: 05/04/2015 04:48 PM IST
Ttdlp leader revanth reddy commented on special classes for kcr


కేసీఆర్ గురించి ఎవరైనా యాంటీగా మాట్లాడాలి అంటే అది రేవంత్ రెడ్డి తరువాత. రేవంత్ రెడ్డి వేసే చలోక్తులు, సూక్తులు అంత బాగా సెట్ అవుతాయి మరి. అందుకే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నుండి ఒక్క రేవంత్ రెడ్డి మాత్రం తలనొప్పిగా మారాడు. తాజాగా కేసీఆర్ పై మరోసారి మాటల తూటాలతో విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ వ్యవహార శైలి వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లుగా ఉందని టీటీడీపీ నేత రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.  శాసనసభా విలువలను కాలరాసిన సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ శిక్షణ తరగతులలో సభా సంప్రదాయాలపై నీతులు చెబుతున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్‌కు కావాలంటే తాను క్లాసులు తీసుకుంటానని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో విలువలను దిగజార్చింది కేసీఆరేనని దుమ్మెత్తిపోశారు.

అసెంబ్లీ కార్యదర్శి సదారాం, హైదరాబాద్‌ సీపీలు టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతులకు వెళ్లడం దారుణమని, వారిద్దరూ టీఆర్‌ఎస్‌ సభ్యులుగా మారిపోయారని వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్‌ తర్వాత కూడా పదవిలో కొనసాగిస్తున్నందుకు కేసీఆర్‌కు సదారాం ప్రభు భక్తి చూపిస్తున్నారని ఆరోపించారు. సదారాం, మహేందర్‌ రెడ్డిలను వెంటనే విధుల నుంచి తొలగించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.టీఆర్‌ఎస్‌ శిక్షణా తరగతుల్లో రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలపై చర్చించలేదని.. కేవలం కేసీఆర్‌ భజన కోసమే శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలపై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు కోర్టు ఉల్లంఘన కిందకు వస్తాయని రేవంత్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు రాజ్యాంగానికి లోబడి ఉన్నాయో లేదో సమీక్షించే అధికారం కోర్టులకు ఉందన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TTDLP  Revanth reddy  kcr  Classes  nagarjunasagar  

Other Articles