Travel entertainment startup PressPlay raises massive seed funding, changes its working model

Startup pressplay travel entertainment raises massive seed funding

startup PressPlay, travel entertainment startup PressPlay, anand sinha, George Abraham, Zomato Employees, Press Play Company, Tabs PressPlay Company Updates, Press Play Facilities

startup PressPlay travel entertainment raises massive seed funding : Both the co-founders Anand Sinha and George Abraham were country heads at Zomato before they quit their jobs and got together to start up PressPlay. YourStory spoke to Anand to know more about the funding and the growth at PressPlay Tabs in last few months.

జీవితాన్ని మార్చేసే ‘సూపర్ ఐడియా’ అంటే ఇది!

Posted: 05/04/2015 03:42 PM IST
Startup pressplay travel entertainment raises massive seed funding

‘ఓ ఐడియా.. మీ జీవితాన్ని మార్చేస్తుంది’! ఈ సూక్తి ప్రతిఒక్కరు తరుచుగా వింటూనే వుంటారు. ఓ ప్రచారం కోసం యాడ్ నేపథ్యంలో తయారైన ఈ వాక్యం ప్రపంచవ్యాప్తంగా బాగానే ఆదరణ పొందింది. అయితే.. ఇది వినడం వరకు మాత్రమే కానీ.. కొత్త ఆలోచనలు ఆవిష్కరించే దిశగా అంతగా వెళ్లలేకపోయింది. అయితే.. తాజాగా ఇద్దరు వ్యక్తులు మాత్రం అందుకు తగినట్లుగానే ఓ కొత్త ఐడియా చేసి.. తమ జీవితాలనే మార్చేసుకున్నారు. వారే ఆనంద్ సిన్హా, జార్జ్ అబ్రాహాంలు!

వివరాల్లోకి వెళ్తే.. ఆనంద్ సిన్హా అనే వ్యక్తి గంటల ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఎంతో బోర్ గా ఫీల్ అయ్యేవాడు. అతని చేసే వృత్తిలో భాగంగా నిత్యం ప్రయాణం చేయాల్సి వుంటుంది కాబట్టి.. అందుకు ఎంతో బోర్ అనుభవించాడు. ఈ క్రమంలోనే ఒకరోజు ఢిల్లీ నుంచి అమృత్ సర్ ప్రయాణించాల్సి వచ్చింది. అప్పుడు బస్సు ఎక్కే ముందు ఇతనికి ఓ చిన్న ఆలోచన తట్టింది. అదే ఇతని జీవితాన్ని మార్చేసింది. ఆ ఐడియా ఏంటంటే.. బస్సులో దూరప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు ఎలాగో బోర్ గా ఫీల్ అవుతారు కాబట్టి అలాంటి సమయంలో ప్రయాణికులకు వినోదం అందిస్తే బాగుంటుందని ఇతడు భావించాడు. అందుకు ఇతగాడు 10 ట్యాబ్స్ కొనుగోలు చేసి.. వాటిల్లో సినిమాలు, గేమ్స్ లోడ్ చేశాడు. వాటిని ప్రయాణికులకు రూ.100 అద్దెకివ్వాలని తలచాడు. అతడు అనుకున్నట్లుగానే ఈ ప్లాన్ సక్సెస్ అయ్యింది. నిముషంలోనే అన్ని ట్యాబ్స్ అద్దెకు వెళ్లిపోయాయి. అంతే.. మరుసటి రోజు నుంచి అదే అతని వ్యాపారమైంది.

Anand-Siinha-News

ఆనంద్ సిన్హాతోపాటు జార్జ్ అబ్రహాం కూడా తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి డిసెంబర్ 2013లో ఈ ట్యాబ్స్ అద్దె పంపిణీని ‘స్టార్టప్ ప్రస్ ప్లే’ పేరిట సంస్థను స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నికర అమ్మకాల రూపంలో రూ.1.26 కోట్ల ఆదాయం వచ్చింది. 2017-18 నాటికి రూ.100 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా సంస్థ సాగుతోంది. వీరి ఆలోచనకు ముచ్చటపడ్డ ఏంజల్ ఇన్వెస్టర్లు ఆగస్టు 2015లో 5 లక్షల డాలర్లు (రూ.3 కోట్లు) పెట్టి ప్రోత్సాహించారు. ఆపై గల నెలలో సికోయా కిపిటల్ 2.2 మిలియన్ డాలర్లు (12.5 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. ఇఫ్పుడీ సంస్థ దేశవ్యాప్తంగా పలునగరాల్లో సేవలు అందిస్తోంది. ప్రముఖ గేమింగ్ సంస్థలు తమ గేమ్స్ డౌన్ లోడ్ చేసుకోవాలని ఆఫర్లు ఇస్తున్నాయి.

బస్సు బయలుదేరే సమయానికి ‘ప్రస్ ప్లే’ ప్రతినిధి వచ్చి ట్యాబ్స్ ఆఫర్ చేస్తాడు. ఆపై గమ్యస్థానంలో మరో ప్రతినిధి వచ్చి వాటిని కలెక్ట్ చేసుకుంటాడు. ఇలా ట్యాబ్ లు అద్దెకిస్తున్నందుకు బస్ ఆపరేటర్లు మాత్రం ఏమీ అగడటం లేదట. పైగా వారికి ‘మా బస్సులో ట్యాట్స్ అద్దెకు లభించును’ అని అదనపు సేవలు అందిస్తున్నట్లు భావిస్తున్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ సేవలను రైళ్లు, విమానాల్లోనూ అందించాలని నిర్ణయించారు. బస్సుల్లో వైఫై సౌకర్యాన్ని కూడా ఈ సంస్థ అందించాలని లక్ష్యం పెట్టుకుంది. త్వరలోనే టచ్ ప్లే పేరిట 30 సినిమాలు, 1000 పాటలు తదితరాలతో కూడిన ఓ యాప్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 2 వేలకు పైగా ట్యాబ్ లను అద్దెకిస్తున్నామని, మే నెలాఖరుకు ఈ సంక్య 3 వేలకు దాటుతుందని ఆనంద్ సిన్హా వివరించారు.

ఇక ఈ సంస్థకు మూలకారకుడైన ఆనంద్ సిన్హా గురించి మాట్లాడుకుంటే.. అతను మొదట ‘జొమాటో’లో పనిచేశాడు. హైదరాబాద్ లోని హెడ్జ్ ఫండ్ సంస్థ ‘దేషా’లోనూ పనిచేశాడు. అప్పటి సహచరులంతా ఇప్పుడు ఇతని కిందిస్థాయి ఉద్యోగులయ్యారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : startup PressPlay  anand sinha  George Abraham  

Other Articles