china | Narendra modi| weibo

Prime minister narendra modi joined a chinese hybrid of micro blogging website sina weibo

china, Narendra modi, bejing, facebook, chinese, sina weibo

Prime Minister Narendra Modi on Monday joined Sina Weibo - a Chinese hybrid of micro blogging website Twitter and social networking site Facebook - days ahead of his visit to Beijing. Twitter is banned in China while Facebook is highly regulated by the state.

చింగిరి చించిం అంటున్న నరేంద్ర మోదీ

Posted: 05/04/2015 12:42 PM IST
Prime minister narendra modi joined a chinese hybrid of micro blogging website sina weibo

చింగోంగ్ చికరేనాచతర... ఏంటీ ఏదేదో రాశారు అనుకుంటున్నారా.. చైనా భాషండీ బాబు. అవును చైనా భాష. ప్రపంచంలొ ఎక్కువ మంది మాట్లాడే చైనా భాష గురించే మాట్లాడుతున్నాం మన భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా భాషను నేర్చుకుంటున్నారు. అందులో భాగంగానే నాలుగైదు చైనా పుస్తకాలు కూడా కొన్నారట లేండి. అయితే ఇప్పటికిప్పుడు నరేంద్ర మోదీ గారికి చైనీస్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నారా.. త్వరలోనే మన ప్రధాని బీజింగ్ పర్యటనకు వెళుతున్నారు. అందుకే ఆ పర్యటనలోపు నాలుగు పదాలైనా నేర్చుకొని అక్కడి వాళ్లను ఆకర్షించాలని అనుకుంటున్నారట.

modi-insert-01

అంతేనా అక్కడి వారికి మరింత దగ్గర కావడానికి అక్కడి సోషల్ నెట్ వర్క్ లలో ఖాతాలు కూడా తెరిచారు. అది కూడా చైనీ భాషలోనే. అదే ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. సినో సియోబో అనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో అకౌంట్ ఓపెన్ చేశారు. అయితే చైనాలో ఫేస్ బుక్ నెట్ వర్క్ మొత్తం ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. అలానే అక్కడ ట్విట్టర్ మొత్తానికే నిషేదించబడింది. అందుకే నెట్ వర్క్ సైట్లలో కాస్త పేరున్న నెట్ వర్క్ సినో సియోబో లో అకౌంట్ తెరిచారు. ఏ ప్రాంతానికి వెళితే అక్కడి వారిని ఇంప్రెస్ చెయ్యడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారు అని అందరికి తెలుసు. మరి చైనాలో ఫాలోయింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  Narendra modi  bejing  facebook  chinese  sina weibo  

Other Articles