al Qaeda propaganda video claims PM Modi called for Muslims to be 'burnt alive'

Al qaeda propaganda video claims pm modi called for muslims to be burnt alive

narendra modi news, al Qaeda videos, al Qaeda modi videos, al Qaeda narendra modi controversy, al Qaeda latest updates, al Qaeda news, al Qaeda, al Qaeda india attacks, photos, narendra modi photos

al Qaeda propaganda video claims PM Modi called for Muslims to be burnt alive : Al Qaeda's latest propaganda video titled 'From France to Bangladesh: The Dust Will Never Settle Down' has made mention of Prime Minister Narendra Modi.

మోదీయే మా టార్గెట్ : అల్ ఖైదా సంచలన వీడియో

Posted: 05/04/2015 01:14 PM IST
Al qaeda propaganda video claims pm modi called for muslims to be burnt alive

భారతదేశంపై నిత్యం ఉగ్రరూపం దాల్చే అల్ ఖైదా ఉగ్రవాదులు.. తొలిసారిగా ప్రధాని పేరును ప్రస్తావిస్తూ ఓ సంచలన వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో అల్ ఖైదా భారత ఉపఖండ విభాగం (ఏక్యూఐఎస్ - అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్) చీఫ్ మౌలానా అసీమ్ ఉమర్ ‘ఫ్రం ఫ్రాన్స్ టు బంగ్లాదేశ్: ది డస్ట్ విల్ నెవర్ సెటిల్ డౌన్’ పేరిట 2వ తేదీన విడుదల చేశారు. ఈ వీడియోలో ‘ముస్లింలను సజీవదహనం చెయ్యాలన్న మోదీయే ఇండియాలో మా టార్గట్’ అన్న సంచలన సందేశాన్ని పేర్కొన్నారు.

ఆ వీడియోలో స్వయంగా ఉమర్ ఇంకా ఏం పేర్కొన్నారంటే.. భారత ప్రధాని మోదీ గతంలో ముస్లింలపై యుద్ధం చేయాలని వ్యాఖ్యానించినట్లుగా ఆరోపించాడు. ముస్లింలను సజీవదహనం చేయాలని మోదీ బహరింగంగా వ్యాఖ్యానించినట్లు తెలిపాడు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాల్లో ఇటీవలి రచయితల హత్యలు తమపనేనని ఉమర్ స్పష్టం చేశాడు. ఇండియాలో పవిత్రయుద్ధం (జీహాద్) జరగాలని, ఇస్లామిక్ పాలన తెచ్చి, షరియా చట్టాలు అమలు చేయడలమే తమ లక్ష్యమని అన్నాడు. ఈ క్రమంలోనే అతగాడు ఐఎంఎఫ్ర విధానాల నుంచి డ్రోన్ దాడులు, కెల్లీ లూగర్ బిల్, చార్లీ హెబ్డో రాతలు తదిరాతలను ప్రస్తావించాడు.

ఇదిలావుండగా.. వీడియోలో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్న అసీమ్ ఉమర్ గురించి భారత్ అధికారుల వద్ద పెద్దగా సమాచారం లేకపోవడం గమనార్హం! అతడు ఉత్తర భారతావనికి చెందిన వ్యక్తి అయివుండవచ్చునని, 90వ దశకంలో పాకిస్థాన్ కు తరలివెళ్లి వుండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం ఈ వీడియో హాట్ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : al Qaeda  Narendra Modi  India Attacks  

Other Articles