Ap | Foodsecurity | Ration cards

Andhra pradesh govt review the rules to allot the foodsecurity card

Ap, Foodsecurity, Ration cards, Ration, Public Distribution, PDS

andhra pradesh govt review the rules to allot the foodsecurity card. Ap Govt plans to distribute food security cards strictly.

ఏపిలో ఆహారభద్రత కార్డ్ పొందాలంటే అర్హతలు ఇవే..!

Posted: 05/04/2015 09:59 AM IST
Andhra pradesh govt review the rules to allot the foodsecurity card

ప్రభుత్వం మారిన ప్రతీసారి రూల్స్ మారేది ఒక్క రేషన్ కార్డుల విషయంలోనే. ప్రభుత్వం మారిన ప్రతిసారి కార్డు రంగు మారడం.. రూల్స్ వమారడం ప్రజలకు కూడా విసుగుపుట్టిస్తోంది. అయితే ఏపిలో కొత్తగా జారీ చెయ్యనున్న ఆహార భద్రత కార్డులపై ప్రభుత్వం తీవ్రంగా ఎక్సర్ సైజ్ చేస్తోంది. గతంలో ఆరోగ్యశ్రీ, బోధనా రుసుముల తిరిగి చెల్లింపు తదితర సంక్షేమ పథకాలన్నింటికీ రేషన్‌కార్డులను లింకు పెట్టడంతో వాటికోసం అందరూ కార్డులను తీసుకున్నారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా కార్డులను కేవలం రేషన్‌సరకులు పొందేందుకు మాత్రమే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న 1.30కోట్ల కార్డుల్లో కనీసం 10శాతం వరకైనా కార్డుల సంఖ్య తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానంతో సుమారు 9లక్షల బోగస్‌కార్డులను తొలగించారు. ఇప్పుడున్న 1.30కోట్ల కార్డుల్లోనూ మరో 25శాతం వరకు బోగస్ కార్డులుంటాయని పౌరసరఫరాల శాఖ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఆహారభద్రత కార్డుల జారీకి కట్టుదిట్టమైన మార్గదర్శకాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది.

కార్డు పొందేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న వారిలో అర్హులు..
* ఇల్లులేని వారు, ఇళ్లల్లో పాచి పనిచేసుకునేవారు, అసంఘటిత రంగంలో పనిచేసే రోజువారీ కూలీలు.
*వితంతువులు, ఏ దిక్కూ లేని ఒంటరి మహిళలు, అంగవైకల్యం ఉన్నవారు, 60ఏళ్లకు పైబడిన, దిక్కులేని వృద్ధులు.
* ఎస్సీ, ఎస్టీ గిరిజన(ఏజెన్సీ) ప్రాంతాల్లో అయితే ఏ ఆధారం లేని ఎవరైనా సరే.
* విద్యుత్ బిల్లు నెలకు రూ.500లోపు ఉన్నవారు.
* జాతీయ ఉపాధి హామీ పథకం కార్డుదారులు (వినియోగంలో ఉన్న కార్డుదారులు మాత్రమే).
* బలహీన వర్గాల (వీకర్‌సెక్షన్) కాలనీల్లో నివాసం ఉండే దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) కుటుంబాలు.
* 2.5 ఎకరాల నీటి వసతి ఉన్న భూములున్నవారు, లేదా సాగుభూమి, మెట్ట కలిపి 5ఎకరాల్లోపు ఉన్నవారు.

ప్రభుత్వ ప్రతిసాదన ప్రకారం వీరికి కార్డులు రావు..
* నాలుగు చక్రాల వాహనం, కుటుంబంలో ఒక సభ్యుడికి 100సీసీకి మించిన మోటారు సైకిల్ ఉన్నవారు.
* 750 చదరపు గజాలకు మించిన స్థలంలో సొంత, లేదా అద్దె ఇంట్లో ఉంటున్నవారు.
* ఇంట్లో ఏసీ ఉన్నవారు.
* రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, ఎయిడెడ్, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నవారు. వీటి నుంచి పింఛన్ పొందుతున్నవారు.
* ఆదాయపన్ను చెల్లిస్తున్నవారు.
* 2 సిలిండర్లతో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు.
* వైద్యులు, గుత్తేదారులు, వృత్తిదారులు, స్వయం ఉపాధి ఉన్నవారు. పొరుగుఒప్పంద ఉద్యోగులు, ప్రైవేటులో జీతం తీసుకుంటున్న ఉద్యోగులు.

(From the Eenadu Inputs)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Foodsecurity  Ration cards  Ration  Public Distribution  PDS  

Other Articles