Police | Indore | Rowdy | Arrest

Police show their real power in indore

Police, Indore, Rowdy, case

Police | Indore | Rowdy | Arrest In order to check growing crime rate in the city, Indore police has come out in full force. The police have pulled out the criminals and history sheeters from their homes and beat them in front of public in major crossings of the city.In 24 hours, they nabbed 340 criminals of the city. In total, 75 are send to jail.

పోలీస్.. పవరంటే ఇదేరా.. రోడ్ల మీదే చితాక్ చితాక్

Posted: 05/02/2015 03:45 PM IST
Police show their real power in indore

పోలీస్ పవర్ అంటే ఇదిరా అంటూ రోడ్ల మీద రౌడీలను తన్నుకుంటూ తీసుకువెళ్లే పోలీసులను సినిమాల్లో చాలా మందినే చూశాం. ఇంకెన్నాళ్లు అన్యాయానికి, అరాచకానికి బలవుతారు అంటూ రోడ్ల మీద ఈడ్చి ఈడ్చి కొట్టే పోలీసులను సినిమాల్లో చాలా హైలెట్ గా చూపిస్తుంటారు. అయితే అక్కడక్కడ కొంత మంది పోలీసులు కాస్త పెద్ద మనసుతో రౌడీలను రోడ్ల మీద కొడుతూ జనాలకు అలాంటి సన్నివేశాలు చూసే అదృష్టాన్ని కలిగిస్తుంటారు. అయితే అచ్చు సినిమాలోలాగా అన్యాయం ఎక్కువైతే చాలు కార్లు, సుమోలు వేసుకొని రోడ్ల మీద రయ్ రయ్ మంటూ తిరిగి రౌడీలను చితకబాది అరెస్టు చేస్తే ఎలా ఉంటుందో తెలుసా.. అబ్బో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటున్నారా.. అవును ఇప్పుడు చెప్పిన సీనంతా నిజంగా జరిగింది. సినిమా షూటింగ్ అస్సలు కాదు.

ఇండొర్ సిటిలో రౌడీయిజం పెరిగిపతోంది. రోజురోజుకు క్రైం రేట్ పెరుగుతోంది. దాంతో పోలీసులపై అందరూ విమర్శలు గుప్పించారు. అలా విమర్శల వర్షం తట్టుకోలేక.. చిరాకులో పోలీసులు ఒక్క సారిగా సిటిని రౌడీలు లేకుండా చెయ్యాలని అనుకున్నారు. అంతే అనుకున్నదే ఆలస్యం వెంటనే వెహికిల్స్ వేసుకొని పాత రికార్డుల్లో ఉన్న రౌడీలను రోడ్ల మీద తన్నుకుంటూ తీసుకెళ్లారు. అయితే ఒక్క రోజులో దాదాపు 340 మంది అరెస్టు చేశారంటే పాపం పోలీసులకు ఎంత ఫ్రస్టేషన్ ఉంటుందో అర్థమవుతోంది. అయితే అందులో 70 మంది కస్టడీకి కూడా తరలించారు. మొత్తానికి కేవలం 24 గంటల్లో అంత మంది రౌడీలను అరెస్టు చెయ్యడం ఓ రికార్డు వాళ్లను రోడ్ల మీద కొట్టడం మరో రికార్డుల ఇలా పోలీసులు రికార్డుల మీద రికార్డులు కొట్టేశారు. పోలీసులకు కాలితే ఎలా ఉంటుందో ఇదే ఉదాహరణేమో మరి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Indore  Rowdy  case  

Other Articles