TTD | Chadalavada | Oath

Ttd palakamandali oath in tirumala tirupathi temple today

chadalavada krishnamurthy, neeta ambani, k raghavendra rao, shyam sunder, tirumala tirupati temple

TTD Palakamandali oath in Tirumala tirupathi temple today.ttd palakamandali list ap govt tirumala tirupati temple chadalavada krishna murthy : Ap Government announce ttd palakamandali list. Chadalavada krishnamurthy elected as chairmanttd palakamandali,

కొలువైన తితిదే పాలక మండలి

Posted: 05/02/2015 01:25 PM IST
Ttd palakamandali oath in tirumala tirupathi temple today

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలి కొలువుదీరింది.  ఆలయ సన్నిధిలో ఉదయం  చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, అనంతరం బోర్డు సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులు ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం చేశారు. గతవారమే పాలకవర్గాన్ని ఖరారు చేస్తూ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నా.. మంచి ముహూర్తం కొసం పాలక మండలి ప్రమాణ స్వీకారం కోసం వేచిచూసింది. మొత్తానికి ఈ ఉదయం పాలక మండలి కొలువుదీరింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, హాజరయ్యారు. చైర్మెన్ గా నియమితులైన చదలవాడ కృష్ణమూర్తి చంద్రబాబు మార్క్ పాలన చూపిస్తామని.. సేవకులలో మొదటి సేవకుడిగా పని చేస్తానని వెల్లడించారు.

ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల వివరాలు...
*చదలవాడ కృష్ణమూర్తి (చైర్మన్)
*రాఘవేంద్రరావు (సినీ దర్శకుడు)
*కోళ్ల లలిత కుమారి (ఎమ్మెల్యే విజయనగరం జిల్లా శృంగవరపుకోట)
*పిల్లి అనంతలక్ష్మి (ఎమ్మెల్యే కాకినాడ రూరల్-తూర్పుగోదావరి జిల్లా)
*డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి (ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా కొండేపి)
*పుట్టా సుధాకర్ యాదవ్ (మైదుకూరు, వైఎస్ఆర్ జిల్లా)
*ఏవీ రమణ (హైదరాబాద్)
*జె.శేఖర్ (తమిళనాడు)
*సుచిత్ర ఎల్లా (తమిళనాడు)
* సంపత్ రవి నారాయణన్ (తమిళనాడు)
*పి.హరిప్రసాద్ (తిరుపతి)

మొత్తం టీటీడీ సభ్యుల జాబితా..
బాల వీరాంజనేయ స్వామి, పిల్లి అనంతలక్ష్మి, కోళ్ల లలిత కుమారి, రవి నారాయణ్, శ్యాం సుందర్ శివాజీ, వై. శ్రీనివాస స్వామి, బోండా ఉమామహేశ్వర రావు, గన్ని ఆంజనేయులు, పి.రమణ, హరిప్రసాద్, ఆకులు సత్యనారాయణ (బీజేపీ), భాను ప్రకాశ్ (బీజేపీ), సినీ దర్శకుడు కే రాఘవేంద్రరావు, దండు శివరామరాజు, శేఖర్, వైటీ రాజా, సుధాకర్ యాదవ్ లతోపాటు అటు  తెలంగాణ నుంచి.. చింతల రామచంద్రా రెడ్డి (బీజేపీ), గడ్డం సాయన్న, సండ్ర వెంకట వీరయ్య కాగా.. తమిళనాడు నుంచి కృష్ణమూర్తిలను నియమించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ttd palakamandali  chadalavada krishnamurthy  neeta ambani  ap govt  

Other Articles

Today on Telugu Wishesh