Austria rejects US request to extradite Ukrainian tycoon Dmytro Firtash

Austria rejects us bid to extradite dmytro firtash

austria, bribery, chicago, court, extradition ,india, justice department, request, us, vienna, Dmytro Firtash, KVP ramachandra rao, YS rajashekar reddy, political, general news, corruption, crime, courts, financial crime, politics, international relations, domestic politics, government bodies, executive branch

VIENNA—An Austrian court ruled late on Thursday night not to extradite Ukrainian billionaire Dmytro Firtash to the U.S., where he is facing bribery charges

ఆస్ట్రియా కోర్టులో అమెరికాకు ఎదురుదెబ్బ.. కేవీపీకి ఊరట

Posted: 05/01/2015 06:52 PM IST
Austria rejects us bid to extradite dmytro firtash

భారత్ లో టైటానియం పరిశ్రమల స్థాపనకు లంచాలు ఇచ్చారన్న అభియోగాల కేసులో ఉక్రెయిన్ వ్యాపార దిగ్గజం డైట్రో ఫిర్తాష్ ను తమకు అప్పగించాలన్న అగ్రరాజ్యం అమెరికాకు అస్ట్రియాలోని వియన్నా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఫిర్తాష్ ను అమెరికా ఎఫ్ బి ఐ అధికారులకు ఎట్టి పరిస్థితులలోనూ అప్పగించేది లేదని వియన్నా నేర సంబంధిత ప్రాంతీయ కోర్టు తేల్చిచెప్పింది. ఉక్రెయన్ కు చెందిన ఫిర్తాష్ తన గ్రూపుకు చెందిన డిఎఫ్ పేరుతో భారత్ లో టైటానియం సంస్థల ఏర్పాటు కోసం సుమారు 18.5 మిలియన్ల డాలర్లను లంచాలుగా ఇచ్చిరని అయనపై అమెరికాలోని చికాగో జిల్లా కోర్టు అభియోగాలు నమోదు చేసింది.

ఈ వ్యవహారంలో పిర్తాస్ ను అదుపులోకి తీసుకోవాలని అమెరికా న్యాయస్థానం, ఎఫ్ బి ఐ అధికారుల వినతిపై అస్ట్రీయా ప్రభుత్వం అయనను అరెస్టు చేసింది. పిర్తాష్ పాస్ పోర్టును స్వాధీనం చేసుకున్నవియన్నా న్యాయస్థానం ఆయనను దేశం విడిచి వెళ్లరాదని అదేశించింది. ఈ క్రమంలో ఆయనకు ఇటీవల రికార్డు స్థాయిలో 125 మిలియన్ యూరోలను పూచికత్తుగా తీసుకన్న న్యాయస్థానం బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ క్రమంలో తమకు పిర్తాష్ ను అప్పగించాలన్న అస్ట్రేలియా అభ్యర్థను వియన్నా న్యాయస్థానం తోసిపుచ్చింది. అమెరికా అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేమని, ఇందులో రాజకీయ అంశఆలు కూడా కారణాలుగా కనబడుతున్నాయని అందకే అతనని అప్పగించలేమని తేల్చిచెప్పింది.

కాగా, టైటానియం పరిశ్రమ స్థాపనకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సమైక్య రాష్ట్రంలో ఆయన ఆంధ్రప్రదేశ్ లోనూ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని, ఈ వ్యవహారంలో అప్పటి ప్రభుత్వ రాజకీయ సలహాదరుగా వున్న కేవీపీ రామచంద్రరావుకు కూడా లంచాలు ఇచ్చారని ఆరోపణలు వున్నాయి. ఈ వ్యవహరాంలో ప్రధాన నిందితుడు పిర్తాష్ ను అదుపులోకి ఇచ్చేందుకు అస్ట్రీయా న్యాయస్థానం సమ్మతించకపోవడంతో.. ఇక ఈ కేసులో కేవీపీని కూడా అమెరికా చికాగో కోర్టు విచారించే అవకాశం లేదని న్యాయనిపుణులు సూచించడంతో ఆయనకు ఊరట లభించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : austria  bribery  chicago  court  extradition  india  justice department  request  us  vienna  

Other Articles