High court | AP | Telangana

High court given shock to telangana govt

High court, AP, Telangana, Order, Supreme court, President, Central govt

HIgh court order that the high court will representate for ap and telangana. Telangana govt trying to get seperate high court.

తెలంగాణ సర్కార్ కు షాక్.. హైకోర్ట్ విభజన ఇప్పట్లో లేనట్లే

Posted: 05/01/2015 03:55 PM IST
High court given shock to telangana govt

హైకోర్టును విభజించాలని గత కొంత కాలం నుండి నడుస్తున్న వివాదానికి ఉమ్మడి హైకోర్ట్ బ్రేక్ వేసింది. తెలంగాణ ప్రభుత్వానికి ఝలక్ కూడా ఇచ్చింది. ఉమ్మడి హైకోర్టును ఇప్పట్లో విభజించేందుకు వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త భవనం నిర్మించిన తర్వాత మాత్రమే హైకోర్టును విభజించాలని తేల్చిచెప్పింది. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసుకునే అధికారం తెలంగాణ రాష్ట్రానికి లేదని హైకోర్టు స్పష్టం చెయ్యడంతో తెలంగాణకు చెందిన న్యాయవాదులు ఖంగుతిన్నారు.  అవసరమైతే ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత బెంచీలు పెట్టుకోవచ్చని, అంతే తప్ప ఇప్పటికిప్పుడు కోర్టును విభజించడం మాత్రం కుదరదని హైకోర్టు చెప్పింది. ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం గచ్చిబౌలి ప్రాంతంలో ఒక భవనాన్ని కూడా కేటాయించింది. కానీ అలా ప్రత్యేకంగా కోర్టు ఏర్పాటుచేసుకునే హక్కు తెలంగాణకు లేదని కోర్టు స్పష్టం చేసింది. దాంతో తెలంగాణ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

ఏపీ హైకోర్టు నిర్మాణానికి నిధులను కేంద్రమే భరించాలని కూడా హైకోర్టు తెలిపింది. తెలంగాణ భూభాగంలో ఆంధ్రప్రదేశ్కు హైకోర్టును నిర్మించడం సరికాదని స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టును రెండుగా విభజించాలని.. ఏపీ, తెలంగాణకు రెండు హైకోర్టులు ఉండాల్సిందేనని తెలంగాణ న్యాయవాదులు ఎప్పటి నుంచో ఆదోళన చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం రాక ముందు నుంచే దీని కోసం ఉద్యమాలు జరిగాయి. ఇక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆందోళనలు చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు హైకోర్టు విభజనపై తుది తీర్పు వెల్లడైంది. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్ట్ లు ఉండాల్సిందేనని గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. కానీ ఏపిలొ ప్రత్యేక హైకోర్ట్ ఏర్పడే వరకు ఇప్పుడున్న హైకోర్ట్ రెండు రాష్ట్రాలకు చెందుతుందని స్పష్టం చేసింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  AP  Telangana  Order  Supreme court  President  Central govt  

Other Articles