Maharastra | horn | pollution | Ban

Banned in maharashtra state now bans horn ok please on trucks

Maharastra, horn, pollution, Ban, Trcuks, Lorrys,

State transport commissioner Mahesh Zagade on Thursday issued a circular banning the use of the phrase "Horn Ok Please" on the rear side of commercial vehicles, such as trucks and tempos, across Maharashtra.

Horn ok Please అని రాయడానికి వీల్లేదు: మహారాష్ట్ర

Posted: 05/01/2015 01:52 PM IST
Banned in maharashtra state now bans horn ok please on trucks

horn ok please అని చాలా వెహికిల్స్ వెనక రాసి ఉంటుంది. చాలా మంది దాన్ని చూసే ఉంటారు. అయితే అలా రాయడం ఇక మీదట చెల్లదు.. ఒకవేళ రాస్తే చర్యలు తప్పవు అని హెచ్చరిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. దేశం మొత్తం పరిచయమైన horn ok please (హారన్ ఓకే ప్లీజ్) అని తమ రాష్ట్రంలో రాయడానికి వీలులేకుండా అక్కడి ప్రభుత్వం తాజాగా ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే దేశం మొత్తం ఉన్న వాహనాల్లో చాలా వరకు మెజారిటీ వాహనాలకు horn ok please అని రాసి ఉంటుంది. అసలు అది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలియదు.. కానీ ప్రస్తుతం దేశం మొత్తం వాడుతున్నారు. అయినా దేశం మొత్తం వాడినా మా దగ్గర మాత్రం వాహనాల వెనుక అది గనక రాసి ఉంటే ఫైన్ ల మోత మోగుతుందని అంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. మరి మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా...

పెద్ద పెద్ద ట్రక్కులు, భారీ లారీలు, డిసిఎంలు ఇలా భారీ వాహనాల వెనకి వైపు horn ok please అని రాసి ఉంటుంది. ముఖ్యంగా హైవేపై ఎక్కువగా తిరిగే వాహనాలకు అయితే ఖచ్చితంగా ఇది రాస్తారు. అయితే ఉన్నట్లుండి ఈ విషయం ఎందుకు వార్తల్లోకి వచ్చిందనుకుంటున్నారా.. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం వాహనాల వెనుక horn ok please అని రాయడానికి వీలులేదంటూ ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇంతకీ ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. రోజురోజుకు పెరుగుతున్న సౌండ్ పొల్యూషన్ ను తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. అవును మన వాళ్లు హాస్పిటల్స్, కోర్టులు, స్కూల్స్ లాంటి ప్రదేశాల్లో హరన్ లు కొట్టరాదు . కానీ వాహనాల వెనుక ఉన్న horn ok please మాత్రం దానికి అవకాశమిస్తోందట. మహారాష్ట్ర మోటర్ వెహికిల్ రూల్స్ సెక్షన్ 134(1) కింద సౌండ్ పొల్యూషన్ కు అవకాశం ఉందట. అందుకే అక్కడి ప్రభుత్వం వాహనాల వెనుక అసలు హారన్ కొట్టమని రాయకపోతే బెట్టర్ కదా అని ఆలోచించి.. ఈ నిర్ణయం తీసుకుంది.
(Source : Indiatimes.com)

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharastra  horn  pollution  Ban  Trcuks  Lorrys  

Other Articles